Advertisementt

‘ఇష్టం’కు దర్శకేంద్రుడి టచ్..!!

Sun 16th Dec 2018 02:19 PM
k raghavendra rao,launch,ishtam,first look  ‘ఇష్టం’కు దర్శకేంద్రుడి టచ్..!!
Krr launches Ishtam First Look ‘ఇష్టం’కు దర్శకేంద్రుడి టచ్..!!
Advertisement
Ads by CJ

నంది గ్ర‌హీత‌, 150 సినిమాల క‌ళా ద‌ర్శ‌కుడు అశోక్.కె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన మొద‌టి సినిమా ‘ఇష్టం’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఏ.కె.మూవీస్ ప‌తాకంపై ఆషా అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రామ్ కార్తీక్, పార్వతి అరుణ్(తొలి పరిచయం)హీరో హీరోయిన్ లుగా నటించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.  నిర్మాణానంత‌ర ప‌నులు ముగింపులో ఉన్నాయి. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఫ‌స్ట్‌లుక్ రిలీజైంది. ఇక ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కోర‌ల‌త్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆయ‌న‌ తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ కలిపి 5 భాషల్లో దాదాపుగా 150 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా ప‌ని చేశారు. ఐదు సినిమాలకు నంది అవార్డులు అందుకున్న మేటి ప్ర‌తిభావంతుడు. బొబ్బిలి రాజా, మాస్టర్, డాడి, టక్కరి దొంగ, అంజి, వర్షం, యమదొంగ, ఒక్కడు, గంగోత్రి, పౌర్ణమి, అరుందతి, వరుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌కు క‌ళాద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఆయ‌నే. తొలిసారి ద‌ర్శ‌కుడిగా మారి తెలుగు సినీప్రేక్ష‌కుల ఆశీస్సులు కోరుతున్నారు. 

ద‌ర్శ‌కుడు అశోక్.కె మాట్లాడుతూ - ‘‘చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. ఇదో యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్. ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. త్వ‌ర‌లోనే ఆడియో స‌హా, సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ద‌ర్శ‌కేంద్రుని ఆశీస్సుల‌తో ఫ‌స్ట్‌లుక్ రిలీజైంది. విజ‌యం అందుకుంటామ‌న్న ధీమా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:  జె.డి.రామ్ తుల‌సి, సంగీతం: వివేక్ మ‌హాదేవ‌, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంక‌టేష్‌,   కథ : సురేష్ గడిపర్తి   ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్:  రాజీవ్ నాయిర్‌, నిర్మాత‌: ఆషా అశోక్.

Krr launches Ishtam First Look:

Top Art Director Turns Director

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ