`అర్జున్‌రెడ్డి`కి క్యాన్స‌రా?

Tue 11th Dec 2018 07:53 AM
shahid kapoor,arjunreddy,kabeer singh,shahid,varma,  `అర్జున్‌రెడ్డి`కి  క్యాన్స‌రా?
shahid kapoor suffering from cancer `అర్జున్‌రెడ్డి`కి క్యాన్స‌రా?
Sponsored links

తెలుగులో  సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం `అర్జున్‌రెడ్డి`. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ రాత్రికి రాత్రే స్టార్ హీరో గా మారిపోయాడు. అత‌ను న‌టించిన ఈ చిత్రం వివిధ భాష‌ల్లో రీమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో విక్ర‌మ్ త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌గా..బాలీవుడ్ రీమేక్‌లో షాహీద్ క‌పూర్ న‌టిస్తున్నాడు. `క‌బీర్‌సింగ్‌` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. కాగా ఈ సినిమాలో న‌టిస్తున్న షాహీద్ క‌పూర్‌కు క్యాన్స‌ర్ అంటూ ఓ వార్త షికారు చేస్తూ  గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 

దీనిపై షాహీద్ క‌పూర్ వివ‌ర‌ణ ఇచ్చాడు. గ‌త కొంత కాలంగా స్ట‌మ‌క్ క్యాన్స‌ర్‌తో షాహీద్ క‌పూర్ బాధ‌ప‌డుతున్నాడ‌ని, అత‌న క్యాన్స‌ర్ మొద‌టి స్టేజ్‌లోనే వుంద‌ని, దీనికి సంబంధించిన ర‌హ్యంగా ముంబైలో త‌ను చికిత్స చేయించుకున్నాడ‌ని  వ‌స్తున్నవార్త‌లు వైర‌ల్ కావ‌డంతో సోమ‌వారం షాహీద్ స్పందించాడు. `నేను ఆరోగ్యంగానే వున్నాను. నాపై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల్ని న‌మ్మ‌కండి` అంటూ వివ‌ర‌ణ ఇచ్చాడు. షాహీద్ కుటుంబం కూడా ఈ వార్త‌ల‌పై స్పందించింది. `మీడియా వ‌ర్గాలు ఏ వార్త‌లు ప‌డితే ఆ వార్త‌లు ఎలా రాస్తారు? ఏ విష‌యాన్ని ప్రామాణికంగా తీసుకుని షాహీద్‌పై వార్త‌లు రాస్తున్నారు, మ‌రోసారి ఇలాంటి వార్త‌ల్ని వ్యాప్తి చేస్తే ఊరుకునేది లేద‌ని మండిప‌డింది. 

Sponsored links

shahid kapoor suffering from cancer:

shahid kapoor suffering from cancer

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019