Advertisement

‘అంతరిక్షం’ ట్రైలర్: చాలా కొత్తగా ఉంది

Mon 10th Dec 2018 10:01 AM
varun tej,anthariksham,trailer,release  ‘అంతరిక్షం’ ట్రైలర్: చాలా కొత్తగా ఉంది
Anthariksham Trailer Released ‘అంతరిక్షం’ ట్రైలర్: చాలా కొత్తగా ఉంది
Advertisement

ఘాజి సినిమాతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి... మళ్ళీ ఒక స్పేస్ థ్రిల్లర్ తో ఆకట్టుకోవడానికి సిద్దమయ్యాడు. ఘాజి సినిమాతో రానాని బెస్ట్ హీరోని చేసిన సంకల్ప్... ఇప్పుడు అంతరిక్షం సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ ని ఎన్నుకున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కిన అంతరిక్షం 9000 KMPH ఈ నెల 21 నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల సమయం దగ్గరపడుతున్న అంతరిక్షం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. తాజాగా మహేష్ ఏఎంబి థియేటర్ లో  9000 KMPH టీం అంతరిక్షం ట్రైలర్ ని లాంచ్ చేసింది. 

ఎన్నో శాటిలైట్స్ కి సక్సెస్ ఫుల్ గా కోడింగ్ చేసిన దేవ్ పేరు ఎవరికీ పరిచయం చెయ్యక్కర్లేని పేరని... అయితే ఇండియన్ స్పేస్ సెంటర్ చేసిన ఒక శాటిలైట్ వలన ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని భావించిన టీం మొత్తం స్పేస్ సెంటర్ ని ఎప్పుడో వదిలేసి వెళ్లిన దేవ్ ని ఒప్పించడంతో... ఆ ఛాలెంజ్ ని దేశ రక్షణగా భావించి తన టీం సత్య దేవ్, శ్రీనివాస్ అవసరాల, అతిధి రావుతో కలిసి ప్రాణాలకు తెగించి అంతరిక్షంలో వెళ్లేందుకు రెడీ అవుతాడు. అలాగే స్పేస్ లో జరిగే కథతో పాటుగా వరుణ్ తేజ్ పర్సనల్ జీవితాన్ని కూడా చూపెట్టారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల మధ్య రొమాంటిక్ సన్నివేశాన్ని కూడా చూపెట్టారు. ఇక అంతరిక్షంలో దేవ్ తాను అనుకున్నది సాధించాడా లేదా అనేది సినిమాలో తెలుస్తుంది కానీ..  9000 KMPH ట్రైలర్ లోనే సినిమా కథ ఎలా వుండబోతుందనేది దర్శకుడు సంకల్ప్ రెడ్డి రివీల్ చేసేశాడు.   

ఇక హాలీవుడ్ లో మాత్రమే ఇలాంటి సినిమాలు చెయ్యగల సామర్థ్యం ఉంటుంది. కానీ సంకల్ప్ ఇండియాలోనే మొదటి స్పేస్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నానని చెబుతున్నాడు. మరి సంకల్ప్ రెడ్డి చెప్పడం కాదు గాని.. సంకల్ప్ చెప్పినట్లుగానే  9000 KMPH ఉండబోతుందనేది ట్రైలర్ లోనే తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాకి నేపధ్య సంగీతం అదరగొట్టేలా కనబడుతుంది. మరి ఫస్ట్ స్పేస్ థ్రిల్లర్ ని చూడడానికి డిసెంబర్ 21 వరకు వెయిట్ చెయ్యడం కాస్త కష్టంలాగే కనబడుతుంది.

Click Here For Trailer

Anthariksham Trailer Released:

Anthariksham Trailer talk

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement