మ‌ళ్లీ తెర‌పైకి మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌

Sun 09th Dec 2018 09:53 PM
mani ratnam,vikram,chiyan vikram,ponniyin selvan,chekka chivantha vaanam,ok kanmani,ok bangaram,  మ‌ళ్లీ తెర‌పైకి మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌
maniratnam reviving ponniyin selvan మ‌ళ్లీ తెర‌పైకి మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌
Sponsored links

మ‌ణిర‌త్నంకు చాలా కాలంగా తీర‌ని కోరిక ఒక‌టి మిగిపోయింది. క‌ల్కీ క‌`ష్ణ‌మూర్తి రాసిన ఫేమ‌స్ హిస్టారిక‌ల్ న‌వ‌ల `పొన్నీయిన్ సెల్వ‌న్‌`. ఈ చారిత్రాత్మ‌క కాల్ప‌నిక క‌థ‌ని తెర‌పైకి తీసుకురావాల‌న్న మ‌ణిర‌త్నం డ్రీమ్‌. గ‌త కొన్నేళ్లుగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చి మ‌ణిర‌త్నం చారిత్రాత్మ‌క చిత్రాల్ని కూడా రూపొందించ‌గ‌ల‌డ‌ని ప్ర‌పంచానికి చాటాల‌న్న‌ది మ‌ణిర‌త్నం కోరిక‌. గ‌తంలో ఈ చిత్రాన్ని మ‌హేష్‌బాబుతో తెర‌కెక్కించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. అయితే చివ‌రి నిమిషంలో ఫైనాన్షియ‌ర్‌లు వెన‌క్కు త‌గ్గ‌డంతో మ‌ణిర‌త్నం ఆ ప్ర‌య‌త్నాన్ని ఆదిలోనే విర‌మించుకున్నాడు.

ప్ర‌స్తుతం `బాహుబ‌లి` త‌రువాత‌ ఇండియ‌న్ సినిమా మార్కెట్ స్థాయి పెర‌గ‌డంతో మ‌రోసారి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడు. `ఓకే క‌న్మ‌ణి`, `చెక్క చివంత వానం` చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ ద‌ర్శ‌క‌జీనియ‌స్ ఈ సినిమా కోసం విక్ర‌మ్‌ను లైన్‌లోకి తీసుకొచ్చాడు. ముందు ఇందులోని కీల‌క పాత్ర కోసం ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌, అజిత్‌, విక్ర‌మ్‌, శింబు, జ‌యం ర‌విల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన మ‌ణి ఫైన‌ల్‌గా చియాన్ విక్ర‌మ్‌ను సెలెక్ట్ చేసుకున్న‌ట్లు త‌మిళ సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. 

విక్ర‌మ్ ప్ర‌స్తుతం అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న `మ‌హావీర్ క‌ర్ణ‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది పూర్త‌యిన వెంట‌నే `పొన్నీయిన్ సెల్వ‌న్‌`ని సెట్స్‌పైకి తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో మ‌ణిర‌త్నం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ సారైనా మ‌ణిర‌త్నం త‌న డ్రీమ్‌ను ఫుల్ ఫిల్ చేసుకుంటాడో మ‌ళ్లీ బ‌డ్జెట్ అనుకూలించ‌లేద‌ని వెన‌క్కుత‌గ్గుతాడో చూడాలి.

Sponsored links

maniratnam reviving ponniyin selvan:

maniratnam reviving ponniyin selvan

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019