మ‌హేష్ `ఏఎంబీ` సామాన్యుల‌కు కాదా?

Tue 04th Dec 2018 10:22 PM
mahesh,mahesh babu,amb cinemas,sunil narang,asian cinemas,amb cinemas multiplex,ts govt,telangana govt,  మ‌హేష్ `ఏఎంబీ` సామాన్యుల‌కు కాదా?
amb not for common people మ‌హేష్ `ఏఎంబీ` సామాన్యుల‌కు కాదా?
Sponsored links

సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఏషియ‌న్ ఫిలింస్ సునీల్‌ నారంగ్‌తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ న‌గ‌రంలోని సాఫ్ట‌వేర్ కంపెనీలు అధికంగా వుండే గ‌చ్చిబౌలీ ప్రాంతంలో మ‌హేష్‌బాబు ఏఎంబీ పేరుతో ఓ మ‌ల్టీప్లెక్స్ ధీయేట‌ర్‌ను సునీల్ నారంగ్ భాగ‌స్వామ్యంలో ప్రారంభించాడు. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ మ‌ల్టీప్లెక్స్ ధియేట‌ర్‌పై సినీ వ‌ర్గాలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తుంటే సామాన్యులు మాత్రం పెదివి విరుస్తున్నారు. కార‌ణం ఇందులో స‌నిమా చూడాలంటే టికెట్ కోసం మ‌ల్టీప్లెక్స్ ధియేట‌ర్‌ల‌కు మించి అధికంగా వ‌సూలు చేయ‌బోతుండ‌ట‌మేన‌ట‌. 

సాధార‌ణంగా మ‌ల్టీప్లెక్స్ ధియేట‌ర్ల‌లో టికెట్ ధ‌ర 150 నుంచి 250 వ‌ర‌కు ఉంటే మ‌హేష్ ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్‌లో మాత్రం ప్రారంభ టికెట్ ధ‌ర 200 వుండ‌నుండ‌గా టాప్ రేంజ్ టికెట్ ధ‌ర 440 వ‌ర‌కు ఉండ నుంద‌ని తెలిసింది. ఇందులోనూ వివిధ కేట‌గిరీలున్నాయి. 200 ఒక టికెట్ వుండ‌గా, 230 ఒక‌టి, 300 ఒక‌టి త‌రువాత టాప్ రేంజ్‌లో వుండే ల‌గ్జ‌రీ టికెట్ రేటు 440గా ధీయేట‌ర్ వ‌ర్గాలు నిర్ణ‌యించిన‌ట్లు వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే ప్ర‌భుత్వం నుంచి మ‌హేష్‌కు త‌ల‌నొప్పులు త‌ప్పేలా లేవు. ప్ర‌భుత్వ నియ‌మాల ప్ర‌కారం మల్టీప్లెక్సుల్లో టికెట్ గ‌రిష్ట ధ‌ర 250 మాత్ర‌మే. దీనికి మించి వ‌సూలు చేస్తే అది చ‌ట్ట విరుద్ధం అవుతుంది. ఈ విష‌యంలో ఏఎంబీ సినిమాస్ అప్ర‌తిష్ట‌పాలు కాక‌త‌ప్ప‌దేమో అంటూ టాలీవుడ్‌లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

Sponsored links

amb not for common people:

amb cinemas not for common man

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019