ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Husharu Pichaak Song Creates Sensation in Youtube

‘పిచాక్’ సాంగ్ పిచ్చెక్కిస్తుందిగా..!!

1 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న‘హుషారు’ సినిమా ‘పిచాక్’ సాంగ్ 

లక్కీ మీడియా సంస్థలో వస్తున్న ‘హుషారు’ పాటలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వరికుప్పల యాదగిరి పాడి, మ్యూజిక్ చేసిన - ‘పిచాక్’ పాట ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ఛానల్‌లో టాప్ ౩ ట్రెండింగ్ లో 1మిలియన్ వ్యూస్ దాటి ‘హుషారు’ సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేసింది. రాహుల్ రామకృష్ణపైన ఎంతో డిఫరెంటుగా పిక్చరైజ్ చేసిన ఈ సాంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ్ణ కెరీర్ లో ది బెస్ట్ గా నిలుస్తుంది. పూర్తి యూత్ ఫుల్ కధాంశంతో తెరకెక్కిన ఈ హుషారు సినిమా డిసెంబర్ (ఏడున) 7న విడుదల అవుతుంది. ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే గుంటూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, నెల్లూరు, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ సిటీలో అన్ని ముఖ్య కాలేజెస్‌లో సందడి చేస్తుంది.

బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ హుషారు‌కి రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు .తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు.

1 M views to Husharu Movie Pichak Song

Husharu Pichaak Song Creates Sensation in Youtube
husharu
pichaak song
1m views
husharu movie
rahul rama krishna