ఇండియా వైడ్‌గా ఇప్పుడు ఎక్కడ చూసినా రోబో 2.ఓ సినిమా ఫీవర్ తో ఉన్నారు సినీ ప్రియులు. గురువారం వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న 2.ఓ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో 2.ఓ సినిమాని పోలుస్తూ అనేక రకాల న్యూస్ లు గత రెండు నెలలుగా వస్తూనే ఉన్నాయి. బాహుబలిని తలదన్నే హిట్ అవుతుందని రజినీకాంత్ అభిమానులంటుంటే... బాహుబలి మీద ఒక్క రూపాయి అయినా ఎక్కువ సాధిస్తేనే 2.ఓ హిట్ కింద లెక్క అంటున్నారు కొందరు. యావరేజ్ హిట్ కాదు, సూపర్ హిట్ కాదు బాహుబలి కలెక్షన్స్ ని 2.ఓ క్రాస్ చేస్తేనే 2.ఓ సూపర్ హిట్ అంటున్నారు.
మరి బాహుబలిని కలెక్షన్స్ విషయంలో క్రాస్ చేస్తుందో లేదో తెలియదు కానీ... ప్రస్తుతం బాహుబలిని ఒక విషయంలో 2.ఓ క్రాస్ చేసేసింది. ఇప్పటివరకు బాహుబలి ఆ విషయంలో ఏ సినిమా క్రాస్ చెయ్యలేకపోయింది కానీ.. ఇప్పుడు 2.ఓ మాత్రం క్రాస్ చేసేసింది. ఎందులో అంటే.. వరల్డ్ వైడ్‌గా 7వేలకు పైగా స్క్రీన్స్ లో ఒకేసారి బాహుబలి సినిమా విడుదలైంది. ఇప్పుడా రికార్డుని 2.ఓ క్రాస్ చేసేసింది. 2.ఓ వరల్డ్ వైడ్ గా అత్యథిక తెరలపై విడుదలవుతున్న ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించబోతోంది. ఈ సినిమా విడుదలకు కొన్ని గంటలు టైం ఉందనగా.... ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10వేల 500 స్క్రీన్స్ లాక్ అయ్యాయి. విడుదల టైమ్‌కి ఈ థియేటర్స్ మరో 300 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మరి సూపర్ స్టార్ రజిని - శంకర్ ఇద్దరు కలిసి చెయ్యబోయే మ్యాజిక్ కోసం కోట్లాది ప్రజలు వేచి చూస్తున్నారు. మరి ఈ అధిక థియేటర్స్ లో సినిమాని విడుదల చేసి మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ తో పెట్టిన పెట్టుబడిలో సగం వెనక్కి తేవాలనే యోచనలో 2.ఓ నిర్మాతలున్నట్టుగా కనబడుతుంది. మరి విడుదలలో అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతూ రికార్డులను సొంతం చేసుకున్న 2.ఓ సినిమా విడుదలై హిట్ టాక్ తో బాహుబలి కలెక్షన్స్ రికార్డులను కూడా తుడిచేస్తుందనే ధీమాలో రజిని అభిమానులున్నారు. చూద్దాం.. బాహుబలిని 2.ఓ బీట్ చేస్తుందా.. లేదంటే.... 2.ఓ మాటలకే పరిమితమవుతుందా?