Advertisementt

సాహో: ఛానెల్స్ 50.. నిర్మాతలు 70!

Sat 24th Nov 2018 01:34 PM
prabhas,producers,70 crore,saaho,satellite rights  సాహో: ఛానెల్స్ 50.. నిర్మాతలు 70!
Confusion on Saaho Satellite Business సాహో: ఛానెల్స్ 50.. నిర్మాతలు 70!
Advertisement
Ads by CJ

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాహో’ షూటింగ్ అసలు జరుగుతుందో లేదో కూడా అప్ డేట్ లేదు. ఏడాది క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా నుండి ఒక పోస్టర్ అండ్ చిన్నపాటి టీజర్ వదిలారు అంతే. కానీ నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా యొక్క శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ అన్ని భారీ అమౌంట్ చెబుతున్నారు.

అన్ని రైట్స్ కలిపి  70 కోట్లు కావాలంటోంది యూవీ క్రియేషన్స్. ముందు నుండే ఇంత చెబుతున్నారు. మళ్లీ తగ్గుతారేమో అని చూస్తే అసలు తగ్గడం లేదు. 70 కోట్లు అయితేనే ఓకే అంటున్నారట. లేకపోతే లేదు అని మొహం మీద చెప్పేస్తున్నారట. దాంతో ఈ సినిమా రైట్స్ పోటీ పడుతున్న జీ తెలుగు, స్టార్ మా, జెమినీ లాంటి సంస్థలు అన్నిటికి ఏమి అర్ధం కానీ పరిస్థితి.

వీరికి ఛానెల్స్ తో పాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి…. కుదిరితే అన్ని హక్కులు కలిపి గంపగుత్తగా తీసుకోవాలని చూస్తున్నాయి. కానీ యూవీ వారు తగ్గట్లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఛానెల్స్ అన్ని 50 దగ్గర ఆగాయి. యూవీ వారేమో 70 చెబుతున్నారు. ఇద్దరి మధ్య 20 తేడా ఉంది. 50 కి మించి వీరు పెరగడం లేదు. 70 కు మించి వీరు తగ్గడంలేదు. దాంతో ఈ మేటర్ ఇప్పుడు అప్పుడే తెగేలా లేదు.

Confusion on Saaho Satellite Business:

Producers Demands Rs 70 crore for Saaho Satellite Rights

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ