Advertisementt

ఈ NTRకి భలే టైటిల్ సెట్ చేశారు..!!

Thu 15th Nov 2018 09:51 PM
nandamuri taraka ratna,new film,title,amruthavarshini  ఈ NTRకి  భలే టైటిల్ సెట్ చేశారు..!!
Superb Title to NTR Film ఈ NTRకి భలే టైటిల్ సెట్ చేశారు..!!
Advertisement
Ads by CJ

నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘశ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకంపై  శివ‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌రాజు నెక్కంటి తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తున్న చిత్రం ‘అమృత వ‌ర్షిణి’.  ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వం గురువారం రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన  హీరో నారా రోహిత్ ముహూర్త‌పు  స‌న్నివేశానికి  క్లాప్ కొట్ట‌గా, మ‌రో హీరో శ్రీకాంత్  కెమెరా స్విచాన్ చేశారు.  అన‌తరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో హీరో నంద‌మూరి తార‌క‌ర‌త్న మాట్లాడుతూ... ‘‘అభిరుచి ఉన్న ద‌ర్శ‌క నిర్మాతలు కావడంతో పాటు, క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేస్తున్నాను. ఇంటెన్స్ ఉన్న స్టోరి . అన్ని ర‌కాల ఎమోష‌న్స్ తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే  క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ‘అమృత వ‌ర్షిణి’.  మంచి టీమ్ కుదిరారు. సినిమాపై చాలా హోప్స్ తో  ఉన్నాం’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు శివ‌ప్ర‌భు మాట్లాడుతూ... ‘‘ఫ‌స్ట్ సిటింగ్ లోనే తార‌క‌ర‌త్న గారు స్టోరీ ఫైన‌ల్ చేశారు.  మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా  తెల‌గు, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో థ్రిల్ల‌ర్, ల‌వ్, స‌స్పెన్స్, యాక్ష‌న్‌, సెంటిమెంట్ ఇలా ప్రతి ఒక్క ఎమోష‌న్ ఉంటుంది. యూత్ కు,  ఫ్యామిలీస్ కు న‌చ్చే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. చిక్ మంగుళూరులో సింగిల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు.

నిర్మాత నాగ‌రాజు నెక్కంటి మాట్లాడుతూ... ‘‘నిర్మాత‌గా నా తొలి సినిమా ఇది. ద‌ర్శ‌కుడు నాకు మంచి మిత్రుడు. క‌న్న‌డ‌లో ఇప్ప‌టికే నాలుగు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక మంచి క‌థ చెప్పడంతో క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో  ఈ సినిమా ప్లాన్ చేశాం, జెస్సీ గిప్ట్ గారు మ్యూజిక్ చేస్తున్నారు.  ఈ నెల 20న షెడ్యూల్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు.

హీరోయిన్ మేఘ‌శ్రీ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాలో నేను సైకియాట్రిస్ట్ గా న‌టిస్తున్నా. ప‌ర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్ర చేస్తున్నా’’ అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: స‌భా కుమార్‌; స‌ంగీతం:  జెస్సీ గిప్ట్;  ఎడిటింగ్: శివ‌ప్ర‌సాద్ యాద‌వ్;  ఫైట్స్: ర‌వివ‌ర్మ‌;  డిఫ‌రెంట్ డానీ;  మాట‌లు-స‌హ ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ కుమార్‌; స‌హ‌నిర్మాత: మంజునాథ‌;  నిర్మాత: నాగ‌రాజు నెక్కంటి; క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం: శివ‌ప్ర‌భు.

Superb Title to NTR Film:

Nandamuri Taraka Ratna Film title is Amruthavarshini

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ