Advertisementt

‘2.O’ రికార్డులు బద్దలవుతున్నాయ్..!!

Tue 13th Nov 2018 05:14 PM
rajinikanth,shankar,2.o trailer,creates,sensation,social media  ‘2.O’ రికార్డులు బద్దలవుతున్నాయ్..!!
Record Views to 2.O Trailer ‘2.O’ రికార్డులు బద్దలవుతున్నాయ్..!!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయనేది ఈ ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. 

కేవలం పది రోజుల్లోనే 140 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది ‘2.0’. 14 కోట్ల మంది ఈ ట్రైలర్‌ను వీక్షించారంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, ఎడిటింగ్: ఆంటోని, నిర్మాత: సుభాష్ కరణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.

Record Views to 2.O Trailer:

2.O Trailer creates Sensation in Social Media

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ