Advertisementt

శేఖర్ కమ్ముల కొత్త సినిమా మొదలైంది

Tue 13th Nov 2018 12:19 PM
sekhar kammula,new movie,pooja,event,details  శేఖర్ కమ్ముల కొత్త సినిమా మొదలైంది
Sekhar Kammula new Movie Launched శేఖర్ కమ్ముల కొత్త సినిమా మొదలైంది
Advertisement
Ads by CJ

‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ క‌మ్ముల చేయ‌బోయే కొత్త సినిమా మొదలైంది. గ‌తంలో త‌న సినిమాల ద్వారా ఎంతో మంది హీరోహీరోయిన్లను ప‌రిచ‌యం చేసిన శేఖ‌ర్ క‌మ్ముల.. ఈ సినిమాలో కూడా అంతా కొత్తవాళ్లకే అవకాశం ఇవ్వనున్నారు. రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ‌గా తెర‌కెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టు, క్లాప్ బోర్డ్ పూజా కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గ‌ణేష్ ఆల‌యంలో జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు.

 ప్రీ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబ‌ర్‌లో మొదలు కానుంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘‘ఏషియ‌న్ గ్రూప్’’ నిర్మాణరంగంలో అడుగుపెడుతోంది. నటీనటులు, మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు. అమిగోస్ క్రియేషన్స్ స‌మ‌ర్పణ‌లో తెరకెక్కబోయే ఈ ప్రేమక‌థ‌కు నిర్మాత‌లు నారాయ‌ణ దాస్ నారంగ్, పి. రామ్మోహ‌న్. కో ప్రొడ్యూస‌ర్-విజ‌య్ భాస్కర్‌, రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల. 

Sekhar Kammula new Movie Launched:

Sekhar Kammula New Movie Pooja Event Details

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ