Advertisementt

‘అదుగో’ అలా ఉంది..?

Thu 08th Nov 2018 07:09 PM
ravibabu,adhugo,movie,report  ‘అదుగో’ అలా ఉంది..?
Adhugo movie Report ‘అదుగో’ అలా ఉంది..?
Advertisement
Ads by CJ

నటుడు చలపతిరావు గారి అబ్బాయిగా తెలుగు తెరకు పరిచయం అయిన రవిబాబు.. చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషించి..ఆ తరువాత  మెగాఫోన్ ప‌ట్టి వైవిధ్య‌మైన చిత్రాలు తీస్తాడు అన్న పేరు తెచ్చుకున్నాడు రవిబాబు. 'అల్లరి, అనసూయ, వేంకటాద్రి, అవును' వంటి విభిన్న చిత్రాలు తీసి రీసెంట్ గా 'అదుగో' అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. పంది పిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం నిన్న దీపావళి సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా రిజల్ట్ ఏంటో చూద్దాం రండి.

'అనసూయ, అవును' లాంటి టైట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని కట్టిపడేసిన రవిబాబు 'అదుగో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్ కు, చిత్రానికి ఎటువంటి సంబంధం ఉండదు. పోస్టర్స్..టీజర్ లో ఉన్న ఇంట్రెస్ట్ సినిమాలో చూపించలేకపోయారు. 'అదుగో' సినిమాను ఆశ‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మయ్యాడు డైరెక్టర్ రవిబాబు. అవసరం లేని పాత్ర తీసుకొచ్చి ఇరికించి గంద‌ర‌గోళం సృష్టించాడు. మూడు వేరు వేరు కథలతో బంటీతో లింక్ పెట్టి.. దానిని సరిగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు రవిబాబు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా నెరేషన్ తో అడుగ‌డుగునా విస‌గించాడు.  దాంతో ఈ సినిమాను ప్లాప్ గా నిర్ధారించారు ప్రేక్షకులు.

ఈ సినిమాలో డైరెక్షన్ కంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటంతో దానిని డీల్ చేసే విధానంలో ఫెయిల్ అయ్యాడు రవి. ముఖ్యంగా రవిబాబు కామెడీని మిస్ అయ్యాం అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఇందులో కొన్ని పాత్రలు ఉన్నప్పటికీ అవి ఏవి అంతగా ఆక‌ట్టుకోలేదు. అభిషేక్ పాత్ర మాత్రం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో పాటు కెమెరా వర్క్ బాగుంది. సాంగ్స్ అంతగా లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సో ఓవరాల్ గా ఈ సినిమా చాలా చెత్తగా ఉందని చూసిన ప్రేక్షకులు అంటున్న మాట.

Adhugo movie Report:

Adhugo Movie small Report

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ