Advertisement

స్టార్స్ లేరు, డబ్బుల్లేవ్.. అందుకే పాదయాత్ర!!

Sun 04th Nov 2018 03:33 PM
adhugo movie,team,padayatra,details  స్టార్స్ లేరు, డబ్బుల్లేవ్.. అందుకే పాదయాత్ర!!
Adhugo Movie Team padayatra Details స్టార్స్ లేరు, డబ్బుల్లేవ్.. అందుకే పాదయాత్ర!!
Advertisement

పంది పిల్ల ప్రధాన పాత్రలో ద‌ర్శకుడు ర‌విబాబు తెర‌కెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’.. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్, నభాలు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించగా, ప్రశాంతి విహారి స్వరాలు అందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌లో దర్శకుడు రవిబాబు ఈ మూవీని నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత సురేష్ బాబు సమర్పించారు. ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌లో చూపిస్తుండడం విశేషం. కాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ పనులని దర్శకుడు రవిబాబు వినూత్నంగా ప్లాన్ చేసారు.. సినిమాలో నటించిన పందిపిల్లతో పాదయాత్ర నిర్వహించి అందరి దృష్టిని సినిమా వైపు మళ్లించుకునేలా చేశాడు. చిత్ర యూనిట్‌తో శుక్రవారం కేబీఆర్ పార్క్ వద్ద నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు పంది పిల్లతో కలిసి పాదయాత్ర చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. గతంలోనూ ఈ పంది పిల్లతో పలు రకాల ప్రమోషన్ వీడియోస్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ మంచి ఇంట్రెస్ట్‌ని కలుగజేసి సినిమాపై అంచనాలను పెంచాయి. పాదయాత్ర అనంతరం చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశంను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో అభిషేక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ బాబు, రవిబాబు గారికి ధన్యవాదాలు. రవిగారితో సినిమా చేయడం ఎంబీఏ చేసినంత గ్రేట్ హానర్. ఆయనతో పనిచేయడం చాలా గొప్ప విషయం. సినిమా చాలా బాగుంటుంది. అన్ని వయసుల వారిని తప్పక ఆకట్టుకుంటుంది.. దీపావళికి వస్తున్న మా సినిమాని తప్పక ఆదరిస్తారని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

నటుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.. ‘‘రవిబాబు సినిమాకి ప్రమోషన్స్ చాలా వెరైటీగా చేస్తుంటాడు. సినిమా కూడా ఆడియెన్స్‌కి విపరీతంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమానచ్చావులే నా 101 వ సినిమా అదుగో. ఆ సినిమాలాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. దీపావళి రోజున వస్తున్న ఈ సినిమాని అందరు ఆదరించాలి..’’ అన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి సహకరించిన అందరికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాతోనే చాలా మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్ ది బెస్ట్. దీపావళి రోజు రిలీజ్ కావడానికి కారణం ఆరోజు సినిమా తప్పకుండా అందరూ చూస్తారనే. ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ.. ‘‘నాతో పాటు పాదయాత్ర చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఇంతకీ ఈ పాదయాత్ర ఎందుకు చేశానంటే ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది. కానీ మా సినిమాకి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ ఎవరూ లేరు. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు. ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ పాదయాత్రకు మరో ముఖ్య కారణం ఏంటంటే ఈ దీపావళికి ఎక్కువగా టపాకాయలు పేల్చకండి. దానివల్ల వన్ మంత్ వరకు క్వాలిటీ ఎయిర్ మనకు అందట్లేదు. ఇప్పటికే చాలా జబ్బులతో బాధపడుతున్న మనకు ఇంకా కొత్తవి రాకుండా ఈ వాతావరణాన్ని కాపాడే బాధ్యత మనది. ఈ సినిమాని తప్పక చూడండి.. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు..’’ అని అన్నారు.

Adhugo Movie Team padayatra Details:

We have no Stars and Budget..says Ravibabu

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement