బుద్దుందా? ‘మీ టూ’పై ఇలానేనా మాట్లాడేది..?

Thu 01st Nov 2018 06:06 PM
actor marimuthu,justify,sexual harassment,vairamuthu,metoo,chinmayi  బుద్దుందా? ‘మీ టూ’పై ఇలానేనా మాట్లాడేది..?
Marimuttu support to Vairamuthu బుద్దుందా? ‘మీ టూ’పై ఇలానేనా మాట్లాడేది..?

‘మీ టూ’ ఉద్యమాన్ని కొందరు పబ్లిసిటీకి, కక్ష్యసాధింపు చర్యలకు ఉపయోగిస్తూ ఉండవచ్చు. కొందరు దీని ద్వారా లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతో, దీనిని నిజాయితీగా నడిపించకపోవచ్చు. కానీ ప్రపంచదేశాలలో, మరీ ముఖ్యంగా మన దేశంలో మహిళలను అబలలుగా చేసి పలు విధాలుగా క్రూర మృగాళ్లు వేధిస్తున్న విషయం మాత్రం పచ్చి నిజం. మగపిల్లలను చిన్ననాటి నుంచి మహిళలను గౌరవించేలా పెంచి, వారిని పెద్దవారిని చేయడం, తమ తల్లి, చెల్లి, అక్క, కూతురు, భార్యలు కూడా సాటి మహిళలే అని, ఇదే వేధింపులు తమ వారిపై జరిగితే మగాళ్లు ఎలా బాధపడతారు? అనేది కూడా నిజాయితీగా ఆలోచించాలి. అంతేగానీ అసలు ‘మీటూ’ ఉద్యమమే తప్పని వాదించడం సరికాదు. 

ఇక తమిళ గేయరచయిత వైరముత్తుపై గాయని చిన్మయిశ్రీపాద నుంచి పలువురు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సోదరికి కూడా ఈయన ప్రవర్తనను తప్పుపట్టింది. అయితే తాజాగా వైరముత్తుకి నటుడు, దర్శకుడు మరిముత్తు అండగా నిలిచాడు. ఆయన వైరముత్తు అలాంటి వాడు కాదని ఖండించి మద్దతు పలికితే అభ్యంతరం లేదు. కానీ ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం గర్హనీయం. 

తాజాగా ఆయన మాట్లాడుతూ.. వైరముత్తు ఏదైనా బంగారు దుకాణంలో దొంగతనం చేస్తే సిగ్గుపడాలి.. కానీ ఓ మహిళను గదికి రమ్మని పిలవడానికి ఎందుకు సిగ్గుపడాలి? దానిని కూడా తప్పు పట్టడం ఏమిటి? వైరముత్తు కూడా మనిషే. ఆయనకు కూడా హార్మోన్లు ఉంటాయి. వైరముత్తుకి మహిళలతో గడపడం ఆనందాన్ని ఇస్తే దానిని కాదనడానికి ఎవరికీ హక్కులేదు. మహిళ ఇష్టం ఉంటే ఆయన పడకగదికి వెళ్తుంది. లేదంటే పోలీసులను, మీడియాను ఆశ్రయిస్తుంది. వైరముత్తుపై ఆరోపణలు చేసిన మహిళ ఇప్పుడు మీడియాను ఆశ్రయించింది... అన్నాడు. 

ఈయన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. మరి ఇదే పని ఆయన భార్యకో, తల్లికో, సోదరీమణికో జరిగినా ఆయన వాదన ఇలాగే ఉంటుందా? కనీసం బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన ఇలా మాట్లాడటం ఏమిటి? అనే విషయాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. 

==========================================

వరస ప్లాప్స్ తో రవితేజ్ అండ్ శ్రీను వైట్ల చాలాకాలం తరువాత చేస్తున్న చిత్రం “అమర్ అక్బర్ అంటోనీ”. ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాపై అందరిలోనూ భారి అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ చూస్తే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధం అవుతుంది. ఇందులో రవితేజ త్రీ షేడ్స్ లో నటిస్తున్నాడు. చాలా రిచ్ విజువల్స్ తో తెరకెక్కిన ఈచిత్రంను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ ఇలియానా పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రనీ సమాచారం. టీజర్ లో చూపించినట్టు ఏమి ఉండదని...సినిమాలో అంత సీను ఉండదంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా మొత్తం మీద ఆమె పాత్ర 30 నిముషాలు లోపే ఉంటుందని టాక్.

మొదట ఈసినిమాలో అను ఎమ్మాన్యుఎల్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలు వల్ల ఆమె ప్రాజెక్ట్ లో భాగం కాలేకపోయింది. ఆ తరువాత ఆమె ప్లేస్ లోకి ఇలియానా వచ్చింది. చాలా కలం తర్వాత ఇలియానా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరి కన్ను ఆమె పాత్రపై పడింది. కానీ ఆమె పాత్ర చాల తక్కువ సేపే అని తెలియడంతో తన ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. వచ్చే నెల అనే నవంబర్ 16 న రిలీజ్ అవుతున్న ఈసినిమా శ్రీనుని..రవిని ప్లాప్స్ నుండి బయటికి లాగుతుందేమో చూద్దాం.

Marimuttu support to Vairamuthu:

Actor Marimuthu justifies alleged sexual harassment by Vairamuthu