‘ఎన్టీఆర్’ బయోపిక్ రిలీజ్ వాయిదా.. నిజమేనా?

Thu 01st Nov 2018 10:17 AM
ntr biopic,balakrishna,rgv,lakshmis ntr,ntr mahanayakudu,krish  ‘ఎన్టీఆర్’ బయోపిక్ రిలీజ్ వాయిదా.. నిజమేనా?
NTR Biopic Postponed ‘ఎన్టీఆర్’ బయోపిక్ రిలీజ్ వాయిదా.. నిజమేనా?
Sponsored links

జనవరి 24 అని డేట్ కూడా ప్రకటించేశాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే మూవీ త్వరలోనే డైరెక్ట్ చేయనున్నాడు వర్మ. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియా సహాయంతో చంద్రబాబు పాత్రను సెట్ చేశాడు వర్మ. కానీ ఇంతవరకు లక్ష్మి పార్వతి పాత్ర.. ఎన్టీఆర్ పాత్రలను ఫైనల్ చేయలేదు.

మరి ఆ పాత్రలు ఎవరు చేస్తారో అన్న సస్పెన్స్ ఇంకా అలానే ఉంది. వర్మ ఏదీ బయటికి చెప్పకుండా లోలోపలే అన్ని కానిచ్చేస్తూ ఉంటాడు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ చేయడంలో వర్మ ఎక్స్‌పర్ట్. ఫస్ట్ లుక్ వచ్చే వరకు అంత రహస్యంగానే ఉంచుతాడు. సినిమాకు మూడు నెలలు మాత్రమే టైం ఉంది.  వర్మ స్టైల్ కి మూడు నెలలు అంటే చాలా ఎక్కువ సమయం. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో సినిమా అనుకున్న రోజే రిలీజ్ చేస్తాడు.

ఇది ఇలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండు భాగాలు ఉన్న సంగతి తెల్సిందే. రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదలను జనవరి 24 న ఫిక్స్ చేసారు మేకర్స్. అయితే ఇప్పుడు ఆ డెసిషన్ మార్చుకుని వాయిదా వేయాలని చూస్తున్నారట. రెండు భాగాలకు గ్యాప్ చాలా తక్కువగా ఉండటంతో కలెక్షన్ పరంగా పబ్లిసిటీ పరంగా ఇబ్బందిగా మారొచ్చనే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఒకవేళ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ 24నే వచ్చేస్తే రెండింటి మీద సోషల్ మీడియాలో అనవసర పోలికలు వచ్చి రచ్చ రచ్చ అవుతుందని ముందుగానే భావించి వాయిదా వేద్దాం అనుకుంటున్నారేమో. లేకపోతే నిజంగానే గ్యాప్ వల్ల ఇబ్బందులు వస్తాయని వాయిదా వేస్తున్నారేమో వేచి చూడాలి.

Sponsored links

NTR Biopic Postponed:

Rumours on NTR Biopic Release 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019