ఆ ఫ్లాప్‌ చిత్రం కోసం రేణూ ఎంతో కష్టపడిందట!

Thu 25th Oct 2018 07:00 PM
renu desai,pawan kalyan,jhonny movie,incidents  ఆ ఫ్లాప్‌ చిత్రం కోసం రేణూ ఎంతో కష్టపడిందట!
Renu Desai Talks about Jhonny Movie ఆ ఫ్లాప్‌ చిత్రం కోసం రేణూ ఎంతో కష్టపడిందట!
Sponsored links

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో ఆయన నటించి, నిర్మాతగా, దర్శకునిగా మారి చేసిన చిత్రం ‘జానీ’. ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్‌ అయి ఉండకపోవచ్చుగానీ పలువురి ప్రశంసలను ఇది పొందింది. పవన్‌లోని క్రియేటివ్‌ పర్సన్‌ని ఈ మూవీ ఆవిష్కరించింది. తన అభిరుచికి తగ్గట్లుగా దీనిని పవన్‌ మలిచాడు. కాగా ఈ చిత్రం గురించి, ఇందులో నటించి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా కూడా పనిచేసిన పవన్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ తన మనసులోని భావాలను తెలిపింది. 

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ మూవీ గురించి ఆమె చెబుతూ, ఈ చిత్రం ప్రారంభం కావడానికి కేవలం రెండు వారాల ముందు మాత్రమే నన్ను ఈ చిత్రానికి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ నేను మొదట్లో ఒప్పుకోలేదు. చివరకు పవన్‌ నన్ను ఒప్పించాడు. జానీ చిత్రానికి నేను మొదట ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పనిచేశాను. నన్ను రెండు వారాల ముందు హీరోయిన్‌గా ఎంపిక చేస్తే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడు నా మనసంతా ప్రొడక్షన్‌ డిజైన్‌, సాంకేతిక వర్గంపైనే ఉంది. కానీ చివరకు పవన్‌ నన్ను ఒప్పించాడు. 

దీంతో ఏడునెలల పాటు రోజుకి 17గంటలు ఈ చిత్రం కోసం పనిచేశాను. ప్రొడక్షన్‌ పనులు చూసుకుంటూ, మేకప్‌ గదిలోకి వెళ్లి మేకప్‌ వేసుకుని హీరోయిన్‌ సీన్స్‌కి రెడీ అయ్యేదానిని. జీవితం ఏదైనా సవాల్‌ విసిరితే దానిని స్వీకరించాలి. అప్పుడే మనం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకుంటామని చెప్పుకొచ్చింది. మొత్తానికి దీని ద్వారా ‘జానీ’ చిత్రం కోసం పవన్‌, రేణుదేశాయ్‌లు ఎంత కష్టపడి పనిచేశారో అర్ధం అవుతోంది. 

Sponsored links

Renu Desai Talks about Jhonny Movie:

Renu Desai Shares Jhonny Movie incidents

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019