పాయల్ రాజ్‌పుత్‌ని డైరెక్ట్‌గా అడిగాడట!

Payal Rajput Reacts on MeToo movement

Sun 21st Oct 2018 10:36 PM
payal rajput,director,metoo,rx 100 heroine,sensational comments  పాయల్ రాజ్‌పుత్‌ని డైరెక్ట్‌గా అడిగాడట!
Payal Rajput Reacts on MeToo movement పాయల్ రాజ్‌పుత్‌ని డైరెక్ట్‌గా అడిగాడట!
Advertisement

ఇటీవల అజయ్‌భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన బోల్డ్‌ చిత్రం ‘ఆర్‌ఎక్స్‌100’ మంచి విజయం సాధించింది. చాలా కాలం తర్వాత వర్మ శిష్యుడు మరోసారి తన సత్తా చాటాడు. ఈ చిత్రంలోని బోల్డ్‌సీన్స్‌, హాట్‌ హాట్‌ సీన్స్‌కి యువత పిచ్చెక్కిపోయింది. అర్జున్‌రెడ్డి తర్వాత ఆ తరహా స్టోరీతో కాసుల వర్షం కురిపించిన చిత్రం ఇదే. ఈ ఒక్క చిత్రంతో హీరో కార్తికేయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌లు వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరులో జరిగిన ఓ హోటల్‌ ఓపెనింగ్‌కి పాయల్‌రాజ్‌పుత్‌ రావడం, అక్కడ అందరు ఆమెని ‘ఆర్‌ఎక్స్‌100’ హీరోయిన్‌ అని ప్రచారం చేసేంత గుర్తింపును యూత్‌లో ఈమె సాధించింది. 

ఇక ఈ పాయల్‌ రాజ్‌పుత్‌ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సంచలన ప్రకటన చేసింది. తన తొలి తెలుగు చిత్రంతోనే హాట్‌ హాట్‌ అందాలు, సన్నివేశాలతో సంచలనం సృష్టించిన ఈమె ‘మీటూ’ ఉద్యమంపై మాట్లాడుతూ, టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందనేది నిజం. నటిగా నిరూపించుకున్న తర్వాత కూడా అది నన్ను వెంటాడుతూనే వచ్చింది. తొలి సినిమాలో హాట్‌గా నటించిన నన్ను నిజజీవితంలో కూడా అందరు అదే విధంగా ఉంటానని భావిస్తున్నారు. 

ఇటీవల ఓ చిత్రంలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి నా వద్దకు వచ్చాడు. ఆఫర్‌ ఇస్తే నాకేం ఇస్తావు ? అని అడిగాడు. ఈ ప్రశ్నతో నేను షాకయ్యాను. అతని చెంపలు వాయించాలని అనిపించినా, కంట్రోల్‌ చేసుకున్నాను. నా టాలెంట్‌కి టాలీవుడ్‌లో గుర్తింపు వచ్చిందే గానీ, ముద్దు సీన్లలో నటించడం వల్ల కాదని ఆయన మొహాన చెప్పేశాను. ఆ ఆఫర్‌ని నేను చేయనని చెప్పి అతనిని పంపించివేశాను...అని తెలిపింది. అయితే ఆ వ్యక్తి పేరేమిటో మాత్రం ఆమె వెల్లడించకపోవడం కొసమెరుపు. 

Payal Rajput Reacts on MeToo movement:

Payal Rajput Sensational Comments on Director


Loading..
Loading..
Loading..
advertisement