Advertisementt

‘నవాబ్’ నిర్మాత చేతుల్లోకి ‘సర్కార్‌’..!!

Tue 16th Oct 2018 01:42 PM
sarkar movie,vijay,ashok vallabhaneni,ar murugadoss  ‘నవాబ్’ నిర్మాత చేతుల్లోకి ‘సర్కార్‌’..!!
Sarkar Movie Release Date Fixed ‘నవాబ్’ నిర్మాత చేతుల్లోకి ‘సర్కార్‌’..!!
Advertisement

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తారు తమిళ దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌. కమర్షియల్‌ అంశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. వైవిధ్యమైన కథలతో ట్రావెల్‌ చేసే విజయ్‌కు మురుగదాస్‌లాంటి దర్శకుడు దొరికితే అభిమానులకు పండగే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘తుపాకీ’, ‘కత్తి’ వంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. ఇప్పుడీ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతోంది. మురుగదాస్‌, విజయ్‌ కలయికలో తమిళంలో వస్తున్న చిత్రం ‘సర్కార్‌’. కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిథి మారన్‌ నిర్మిస్తున్న చిత్రమిది. అభిరుచి గల నిర్మాత, ఇటీవల నవాబ్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అశోక్‌ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసుకున్నారు. 

‘‘నవాబ్‌’లాంటి సూపర్‌హిట్‌ తర్వాత మురుగదాస్‌, విజయ్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ మరో మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఫస్ట్‌లుక్‌కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహిస్తాం. దీపావళి కానుకగా నవంబర్‌ 6న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం’’ అని అశోక్‌ వల్లభనేని చెప్పారు. ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. 

Sarkar Movie Release Date Fixed:

Sarkar Movie Telugu Release Details

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement