ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naga Chaitanya Savyasachi Teaser Release Date out

‘సవ్యసాచి’ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్

Naga Chaitanya Savyasachi Teaser Release Date outNaga Chaitanya Savyasachi Teaser Release Date out

నాగ‌చైత‌న్య, నిధి అగ‌ర్వాల్ జంట‌గా చందూ మొండేటి తెర‌కెక్కిస్తున్న సినిమా స‌వ్యసాచి. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌ యూనిట్. సినిమా చాలా అద్భుతంగా వ‌చ్చింద‌ని.. ఖచ్చితంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని ధీమాగా చెబుతున్నారు ద‌ర్శ‌కుడు చందూ మొండేటి. ఈ చిత్ర టీజ‌ర్ అక్టోబ‌ర్ 1 ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాగ‌చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త జోన‌ర్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు చందూ. భార‌తంలో అర్జునుడికి ఉన్నట్లే.. స‌వ్య‌సాచిలో హీరోకు కూడా రెండు చేతుల‌కు స‌మాన‌మైన బ‌లం ఉంటుంది. అందుకే స‌వ్య‌సాచి టైటిల్ పెట్టారు. ఈ చిత్రంతోనే మాధ‌వ‌న్ తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. భూమిక చావ్లా, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి యం యం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ యేర్నేని, వై ర‌విశంక‌ర్, మోహ‌న్ చెర‌కూరి(సివిఎం) నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ లో స‌వ్య‌సాచి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, ఆర్ మాధ‌వ‌న్, భూమికా చావ్లా, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు: క‌థ, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ందూ మొండేటి, నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్ వై, మోహ‌న్ చెరుకూరి(సివిఎం), స‌హ నిర్మాత‌: ప‌్ర‌వీణ్ ఎం, లైన్ ప్రొడ్యూస‌ర్: పిటి గిరిధ‌ర్ రావు, కో డైరెక్ట‌ర్: చ‌ల‌సాని రామారావు, సిఈఓ: చిరంజీవి(చెర్రీ), సంగీతం: ఎంఎం కీర‌వాణి, ఆర్ట్: రామ‌కృష్ణ‌, సినిమాటోగ్ర‌ఫీ: యువ‌రాజ్, ఎడిట‌ర్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు,  ఫైట్స్: రామ్ ల‌క్ష్మ‌ణ్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Savyasachi teaser Release on Oct 1st

naga chaitanya
savyasachi
teaser
release
october 1