Advertisement

కౌశల్ ఆడుతుంది నిజంగా గేమేనా..??

Wed 26th Sep 2018 03:04 PM
kaushal,bigg boss,mother,daughter,sentiment uses  కౌశల్ ఆడుతుంది నిజంగా గేమేనా..??
Negative Comments on Kaushal Plans in Bigg Boss కౌశల్ ఆడుతుంది నిజంగా గేమేనా..??
Advertisement

మొదట్లో బిగ్ బాస్ సీజన్ 2 మీద ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. నాని యాంకరింగ్ కావొచ్చు, కంటెస్టెంట్స్ కావొచ్చు. బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరిచారు. కానీ క్రమేణా బిగ్ బాస్ సీజన్ 2 లో నాని చెప్పినట్లుగా ఏదైనా జరగొచ్చు అంటూ.. వారానికో రచ్చ జరగడం ప్రేక్షకుల్లో రేపేమవుతుందా అనే క్యూరియాసిటీ కలిగేలా చేసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేసింది స్టార్ మా యాజమాన్యం. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 చివరి వారంలోకి ఎంటర్ అయ్యింది. టాప్ ఫైవ్ లో కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, గీత మాధురి, సామ్రాట్ లు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా దీప్తి, తనీష్, కౌశల్ మధ్య గట్టి పోటీ అంటే టాప్ త్రీ లో ఉంటారని గత వారం ఎలిమినేట్ అయిన రోల్ రైడా చెప్పినట్లుగా అందరూ భవిస్తున్నారు కూడా.

అయితే అందులో ఎక్కువగా కౌశల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటూ బయట కౌశల్ ఆర్మీ నానా రచ్చ చేస్తున్నారు. నాని గనక కౌశల్ ని బిగ్ బాస్ విన్నర్ గా ప్రకటించకపోతే నాని సినిమాలు ఆడనివ్వమనే రేంజ్ లో హంగామా సృష్టిస్తున్నారు.  ఇక కౌశల్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో తానేదో ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. మొదట్లో సైలెంట్ గా ఉన్న కౌశల్, కిరీటి, తేజు, భాను, బాబు గోగినేని చేసిన చిన్న చిన్న తప్పులతో హీరో అయ్యి కూర్చున్నాడు. అయితే వాళ్ళు షో నుండి వెళ్ళిపోయాక కౌశల్ ఫ్రెండ్ నూతన నాయుడు రెండుసార్లు  బయటికెళ్ళొచ్చి కౌశల్ నీకు బయట బాగా సపోర్ట్ ఉంది నువ్వే బిగ్ బాస్ విన్నర్ అని చెప్పడంతో.. బాగా ఎక్కించుకున్న కౌశల్ ఒకానొక టైంలో బ్యాలెన్స్ తప్పి హౌస్ మేట్స్ ని కుక్కలతో పోల్చడం.. యాంకర్ నాని ఎక్స్పెల్నేషన్ అడిగితే.. తలా తోక లేని సమాధానం చెప్పడం.. నీకు నీవు క్యాంపైన్  చేసుకో అని నాని అంటే.. ఏదో పులి, మేక కథ చెప్పడం.. హౌస్ మేట్స్ అంతా వేస్ట్ తానే బెస్ట్ అని... తనకి హౌస్ మేట్స్ మొత్తం కలిపి బిగ్ బాస్ టైటిల్ ని తన చేతిలో పెట్టెయ్యాలన్నట్టుగా  డబ్బా కొట్టుకోవడం కౌశల్ తీరుని మరింతగా దిగజార్చాయి.

అయితే కౌశల్ తాను ఒంటరిగా పోరాడుతున్నానంటూ... తనకి హౌస్ మేట్స్ అస్సలు హెల్ప్ చెయ్యడం లేదంటూ.. తన అమ్మ సెంటిమెంట్ ని ఎక్కువగా అప్లై చేస్తూ వస్తున్నాడు. అవసరమైనప్పుడు, అనవసరమైనప్పుడు తల్లి సెంటిమెంట్ తో ప్రేక్షకుల మైండ్ ని వీక్ చేస్తున్నాడు. ఇక రెండేళ్ల కూతురు లల్లి సెంటిమెంట్ ని కూడా కౌశల్ వదలడం లేదు. హౌస్ మేట్స్ నవ్వుతూ అన్న చిన్న మాటను పట్టుకుని దాన్నే కొండంత చేసి రెండేళ్ల పాప మీద పడి ఏడుస్తున్నారనడం కౌశల్ లోని మరోకోణాన్ని చూపెడుతుంది. మరి టాప్ ఫైవ్ లోకి కౌశల్ పేరు ఎనౌన్స్ చెయ్యగానే.. అమ్మ అంతా నీవల్లే... నీ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పడం.. ఇక కూతురు లల్లి చేసిన ప్రేయర్ కూడా తనని టాప్ ఫైవ్ లోకి చేర్చిందని... ఇక టైటిల్ విన్నర్ అవడం కోసం తనకి ఎవరి సపోర్ట్ అక్కర్లేదన్నట్టుగా మాట్లాడడం చూస్తుంటే కౌశల్ కి తానే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని ముందే తెలిసిపోయిందేమో... అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఏదైనా దీప్తి వంటి వాళ్ళు చేసిన హెల్ప్ మర్చిపోయి.. కౌశల్ ఇలా  ఒంటరి పోరాటం చేస్తూ తల్లి సెంటిమెంట్ ని, కూతురు లల్లి సెంటిమెంట్ ని పుష్కలంగా  వాడుతున్నాడంటూ సెటైర్స్ వేస్తున్నారు.

Negative Comments on Kaushal Plans in Bigg Boss:

Mother and Daughter Sentiment Uses Kaushal in Bigg Boss

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement