Advertisementt

‘నువ్వెందుకు నచ్చావే శైలజ’ టైటిల్‌తో చిత్రం

Tue 25th Sep 2018 02:49 PM
roshan,anusha,nuvvenduku nachhave sailaja,movie,launch  ‘నువ్వెందుకు నచ్చావే శైలజ’ టైటిల్‌తో చిత్రం
Nuvvenduku Nachhave Sailaja Movie Started ‘నువ్వెందుకు నచ్చావే శైలజ’ టైటిల్‌తో చిత్రం
Advertisement
Ads by CJ

అనుపమ ఆర్ట్స్ పతాకంపై నాగేశ్వరరావు దర్శకత్వంలో వి.రామకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘నువ్వెందుకు నచ్చావే శైలజ’. రోషన్, అనూష జంటగా నటిస్తున్నారు. సోమవారం (సెప్టెంబర్ 24) అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కు సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, కొమర వెంకటేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు‌. కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘ఇదొక యాంటీ లవ్‌స్టోరీ. ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించకూడదన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కనుంది. ప్రేమించాలంటే ఉండాల్సిన అర్హతలను ఇందులో చూపిస్తున్నాము. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. యూత్‌కు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. నాలుగు పాత్రల మధ్య ఇంట్రెస్టింగ్ కథనంతో ఈ చిత్రముంటుంది. కథ నచ్చి నిర్మాత రామకృష్ణ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు..’’ అని అన్నారు.

మా తొలి సినిమానే ఇటువంటి కాంటెంపరరీ కాన్సెప్ట్ తో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది‌. బ్రేక్ వస్తుందన్న నమ్మకముందన్నారు హీరోహీరోయిన్లు.

నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘కథ నచ్చి ఈ సినిమాను చేస్తున్నాను. మంచి టీమ్ కుదిరింది. పాపులర్ ఆర్టిస్ట్‌లందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు.’’ అని అన్నారు.

ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు వర్క్ చెయటం ఆనందంగా ఉందన్నారు  డిఓపి  యం. జోషి.

రోషన్, అనూష, బ్రహ్మానందం, పోసాని ,షియాజీ షిండే, ఆశిష్ విద్యార్ది, ధనరాజ్ ,కాదంబరి కిరణ్, సన, మణిచందన, మణి, సూరజ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, డి.ఓ.పి: యం.జోషి, కూర్పు : నందమూరి హరి, ఆర్ట్: విజయకృష్ణ, మేనెజర్స్: బాలాజీ శీను ,సుధాకర్ రావు, నిర్మాత: వి.రామకృష్ణుని, రచన-దర్శకత్వం: నాగేశ్వరావు.

Nuvvenduku Nachhave Sailaja Movie Started:

Nuvvenduku Nachhave Sailaja Movie Launch details

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ