Advertisementt

దేవ, దాసులు వచ్చేందుకు రెడీ..!

Tue 25th Sep 2018 12:07 PM
nagarjuna,nani,devadas,censor,complete  దేవ, దాసులు వచ్చేందుకు రెడీ..!
Devadas Censor Completed దేవ, దాసులు వచ్చేందుకు రెడీ..!
Advertisement
Ads by CJ

దేవ‌దాస్ కు ‘U/A’ స‌ర్టిఫికెట్.. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌.. 

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టించిన సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. వికే న‌రేష్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ఇప్ప‌టికే హిట్ అయింది. ఈ సినిమాకు స్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ వ‌యాక‌మ్ 18తో క‌లిసి అశ్వినీద‌త్ దేవ‌దాస్ సినిమాను నిర్మించారు. 

న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య తదితరులు..

సాంకేతిక విభాగం: ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌, నిర్మాత‌: అశ్వినీద‌త్, సంస్థ‌లు: వైజయంతి మూవీస్ మ‌రియు వ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్,  సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్ సైనూద్దీన్,  సంగీతం: మ‌ణిశ‌ర్మ,  ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహీ సురేష్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్ 

Devadas Censor Completed:

Devadas Censor Details

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ