Advertisementt

విజయ్ ‘నోటా’ పోల్ పెట్టింది అందుకేనా?

Sat 22nd Sep 2018 11:22 PM
nota,release date,vijay deverakonda,nota movie  విజయ్ ‘నోటా’ పోల్ పెట్టింది అందుకేనా?
Vijay Deverakonda Poll on Nota release Date విజయ్ ‘నోటా’ పోల్ పెట్టింది అందుకేనా?
Advertisement
Ads by CJ

‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో బ్లాక్ బాస్టర్స్ ని అందుకున్న విజయ్ దేరవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘నోటా’. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రాబోతుందని ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఇంకా ముందే రావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.

ముందు రావాలని ఫిక్స్ అయ్యారు కానీ.. ఏ డేట్ న వస్తే బాగుంటుందనే దానిపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు టీం. ఈనేపథ్యంలో విజయ్ తన ట్విట్టర్ వేదికగా తన సినిమా విడుదల తేదీని తెలపండి.. అంటూ అక్టోబర్ 5 - లేదా 10  - లేదా 18 న ఈ మూడు డేట్స్ లో ఏ డేట్ నా ‘నోటా’ సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అని డైరెక్ట్ గా ప్రేక్షకులకు పోల్ ని నిర్వహించాడు. అయితే మెజారిటీ పీపుల్ అక్టోబర్ 5న సినిమా రిలీజ్ చేయాలనీ తమ అభిప్రాయాన్ని పోల్ ద్వారా చెప్పారు.

అయితే ‘నోటా’ రిలీజ్ కోసం విజయ్ ట్విట్టర్ లో పోల్ నిర్వహించడానికి మరో కారణం కూడా ఉంది. ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయవద్దని కొంతమంది ప్రొడ్యూసర్స్ నుండి డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఒత్తిడి వచ్చిందంట. దాంతో అప్సెట్ అయినా విజయ్ అలా ట్విట్టర్ లో పోల్ పెట్టాడని చెబుతున్నారు. 

Vijay Deverakonda Poll on Nota release Date :

Makers Confusion on Nota Release date

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ