చైతూ.. క్రేజ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చెయ్?

Fri 21st Sep 2018 11:28 PM
shailaja reddy,worrying,savyasachi,naga chaitanya,chandoo mondeti  చైతూ.. క్రేజ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చెయ్?
Shailaja Reddy Worrying Savyasachi చైతూ.. క్రేజ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చెయ్?
Sponsored links

నాగ చైతన్య - మారుతీ కాంబోలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా గత గురువారమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి కూడా సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే గత ఆదివారం వరకు శైలజా రెడ్డి అల్లుడు సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చాయి. శైలజా రెడ్డి అల్లుడు గట్టెక్కుతాడనుకుంటే.. సోమవారం నుండి అల్లుడు కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు శైలజా రెడ్డి అల్లుడు వలన నాగ చైతన్య మరో మూవీ సవ్యసాచికి టెంక్షన్ పట్టుకుందట. నాగ చైతన్య నటించిన చిత్రాలన్నీ యావరేజ్ హిట్స్ అవడంతో.. అతని మార్కెట్ మీడియం రేంజ్ లోనే ఆగిపోయింది. ఈ శైలజా రెడ్డి అయినా మంచి హిట్ అయ్యి నాగ చైతన్య రేంజ్ పెరుగుతుంది అనుకుంటే.. ఈ సినిమా కూడా యావరేజ్ పడింది.

అసలే నాగ చైతన్య - చందు మొండేటి ల సినిమా కాస్త మాస్ తరహాలో కనబడుతుంది. ఈ సినిమా మొదలు పెట్టుకున్నప్పుడు మంచి అంచనాలే ఉన్నప్పటికీ.. తాజాగా సవ్యసాచి విషయంలో జరుతున్న పరిణామాలు సవ్యసాచి సినిమాకి అడ్డంకులుగా మారుతున్నాయి. ఈ సినిమా ఆగష్టు లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అవుతూ ఇప్పటికి విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు హిట్ అయితే సవ్యసాచికి మంచి డిమాండ్ వచ్చి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతుంది అనుకుంటే.. ఆ సినిమాకి యావరేజ్ టాక్ రావడంతో.. ఇప్పుడు సవ్యసాచి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంతంత మాత్రంగా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. 

మరి శైలజా రెడ్డి అల్లుడుతో హిట్ కొట్టి... సవ్యసాచితో మార్కెట్ పెంచుకోవాలన్న నాగ చైతన్యకి శైలజా రెడ్డి అల్లుడు షాకిచ్చింది. ఇక చందు మొండేటి సవ్యసాచిని ఎప్పుడు పూర్తి చేసి విడుదల చేస్తాడో  గాని.. ఆ సినిమా మీద జనాల్లో ఆసక్తి చచ్చిపోయేలా ఉంది. మరి మాధవన్ వంటి హీరో ఈ సినిమాలో నటించాడు. హీరోయిన్ గా గ్లామర్ డాల్ నిధి అగర్వాల్ నటించింది. ప్రేమమ్‌తో మంచి హిట్ కొట్టిన నాగ చైతన్య - చందు మొండేటి సవ్యసాచితో ఎలాంటి హిట్ కొడతారో గాని... ఆ సినిమా మీద జనాల్లో ఎంత క్రేజుందో మాత్రం ఇప్పుడు అర్ధం కానీ పరిస్థితి.

Sponsored links

Shailaja Reddy Worrying Savyasachi:

No Craze on Chaitu Savyasachi Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019