చరణ్‌ని కాదని. చిన్న హీరోతో సై అంది!

Sun 16th Sep 2018 09:11 PM
payal rajput,heroine,rx 100,ram charan,bellamkonda srinivas,item song  చరణ్‌ని కాదని. చిన్న హీరోతో సై అంది!
RX 100 Heroine says No To Ram Charan చరణ్‌ని కాదని. చిన్న హీరోతో సై అంది!
Sponsored links

రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. అందులో నటించిన హీరోహీరోయిన్స్‌కి కూడా అంతే పేరు వచ్చింది. ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ తొలి సినిమాతోనే పెద్ద విజయం సాధించింది. గ్లామర్ పరంగా.. నటన పరంగా యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న పాయల్ తొందరపడి వచ్చిన అవకాశాలన్నిటిని ఓకే చేయట్లేదు. అందులోను అన్ని RX లాంటి చిత్రాలు రావడంతో.. పాయల్ జాగ్రత్తగా సినిమాలకు సైన్ చేస్తుంది. అయితే గతంలో పాయల్ రాజ్ పుత్.. రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి నో చెప్పిందని టాక్ నడిచింది.

మరి ఇప్పుడు చాలా జాగ్రతగా ఆలోచించి తన కెరీర్ ను ఒక గాడిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె తెలుగులో ఓ సినిమాలో హీరోయిన్, ఇంకో సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఒకపక్క సినిమాలను ఓకే చేస్తూ మరోపక్క ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిందట ఈ ముద్దుగుమ్మ. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమాలో పాయల్ ఐటెం సాంగ్ చేయనుందట. మరి అప్పట్లో రామ్ చరణ్ కి నో చెప్పి ఇప్పుడు బెల్లంకొండపై పాయల్ ఎందుకు ఎస్ చెప్పిందో కానీ... ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అయితే పాయల్‌కి ఎంత పొగరు అంటూ మాట్లాడుకుంటున్నారు.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో పాయల్ ఐటెం సాంగ్ అనే మాట మాత్రం ఫిలింసర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. అంతేకాదు ఈ ఐటెం సాంగ్ కు ఆమె భారీగా అడుగుతుందని తెలుస్తుంది. అయితే ఆమె ఎంత అడిగిన ప్రొడ్యూసర్స్ ఇవ్వటానికి రెడీ అంటున్నారట. చూసారుగా ఆమె క్రేజ్ ఎలా ఉందో..అది మ్యాటర్.

Sponsored links

RX 100 Heroine says No To Ram Charan :

Payal Rajput Item song in Bellamkonda Srinivas and Teja Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019