హిట్ సినిమా సీక్వెల్ కి ఆ ముగ్గురే కావాలట!

Fri 14th Sep 2018 11:01 PM
karan johar,kuch kuch hota hai sequel,alia bhatt,ranbir kapoor,jhanvi kapoor  హిట్ సినిమా సీక్వెల్ కి ఆ ముగ్గురే కావాలట!
Karan Johar Wants To Cast These Actors In Kuch Kuch Hota Hai Sequel హిట్ సినిమా సీక్వెల్ కి ఆ ముగ్గురే కావాలట!

ధర్మప్రొడక్షన్స్‌ అధినేతగా, నిర్మాతగా, దర్శకునిగా దేశవ్యాప్తంగా కరణ్‌జోహార్‌కి ఉన్న గుర్తింపు తెలియనిది కాదు. ఈయన చిత్రం తీస్తున్నాడంటే ఖచ్చితంగా బ్లాక్‌బస్టరేనని ఎవరైనా ఊహిస్తారు. 'బాహుబలి'ని బాలీవుడ్‌లో ప్రమోట్‌ చేయడంలో కూడా ఆయన బలమైన హస్తం ఉంది. ఇక పోతే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు తీసే కరణ్‌జోహార్‌ 'కభీ ఖుష్‌ కభీ గమ్‌, కుచ్‌కుచ్‌హోతాహై' వంటి ట్రెండ్‌ సెట్టింగ్‌ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. ప్రస్తుతం ఆయన రేడియో జాకీగా కొత్త అవతారం ఎత్తాడు. బాలీవుడ్‌ ప్రేమజంట రణబీర్‌కపూర్‌, అలియాభట్‌, శ్రీదేవి పెద్దకుమార్తె జాన్వికపూర్‌లే తన మొదటి చాయిస్‌ అని ఆయన చెప్పుకొచ్చాడు. 

ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ.. 20ఏళ్ల నాటి 'కుచ్‌కుచ్‌హోతాహై' చిత్రానికి సీక్వెల్‌ తీస్తే క్యాస్టింగ్‌ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని ఓ అభిమాని కరణ్‌జోహార్‌ని ప్రశ్నించాడు. ఆ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాలిస్తే రణబీర్‌కపూర్‌, అలియాభట్‌, జాన్వికపూర్‌లతోనే 'కుచ్‌కుచ్‌హోతాహై 2' ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే ఏ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం మాత్రం ఆయన సస్పెన్స్‌లో ఉంచి దానిని మాత్రం రివీల్‌ చేయలేదు. కాగా షారుఖ్‌ఖాన్‌, కాజోల్‌, రాణిముఖర్జీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ 'కుచ్‌ కుచ్‌ హోతా హై' ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Karan Johar Wants To Cast These Actors In Kuch Kuch Hota Hai Sequel:

Karan Johar wants to cast these actors in Kuch Kuch Hota Hai sequel

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2019