Advertisementt

కొడుకు ఎదుగుదల చూస్తే ఏ తండ్రికైనా అంతే!

Sun 02nd Sep 2018 02:59 PM
mahesh babu,son,gautham krishna,12 bday,celebrates  కొడుకు ఎదుగుదల చూస్తే ఏ తండ్రికైనా అంతే!
Mahesh Celebrates Gautham Krishna Bday కొడుకు ఎదుగుదల చూస్తే ఏ తండ్రికైనా అంతే!
Advertisement
Ads by CJ

పిల్లలు చాలా త్వరగా ఎదుగుతూ ఉంటారు. ఇక తమ వారసుల ఎదుగుదల చూస్తే ఏ తండ్రికైనా ఎక్కడలేని ఆనందం వస్తుంది. అప్పుడు పిల్లలు అంత వారైపోయారా? అని ఆశ్చర్యపోతూ ఉంటారు. సూపర్‌స్టార్‌ కృష్ణ తన కెరీర్‌ బిజీలో రోజంతా గడిపేవాడు. దాంతో ఆయన తన కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోయి ఉంటాడు. అందుకేనేమో ఆ లోటు తన సంతానికి ఎదురు కాకూడదని మహేష్‌ భావిస్తూ ఉంటాడు. తన కుటుంబానికి వీలైనంత సమయం కేటాయిస్తూ ఉంటాడు. 

ఇక మహేష్‌ కూడా తాను బాలనటునిగా ఉన్న నాటి నుంచే తండ్రి చిత్రాలలో నటించాడు. అలా చూసుకుంటే మహేష్‌ కుమారుడు గౌతమ్‌ కృష్ణ కూడా '1' నేనొక్కడినే చిత్రంతో బాలనటునిగా పరిచయం అయ్యాడు. ఇక తాజాగా గౌతమ్‌కృష్ణ తన 12వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మహేష్‌ తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాలం వేగంగా జరిగిపోతోందని, తన కుమారుడు ఇప్పటికే 12 ఏళ్లకు చేరుకున్నాడని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. నా కుమారుడు గౌతమ్‌ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎదుగుతుంటే చూడటం ఎంతో ఆనందంగా ఉంది అని మహేష్‌ స్పందించాడు.

Mahesh Celebrates Gautham Krishna Bday:

Mahesh Babu in Full Happy Mood

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ