బాధపడుతున్నానంటున్న బాద్‌షా కూతురు!

Fri 03rd Aug 2018 01:34 PM
shah rukh khan,daughter,suhana khan,bikini pics,instagram  బాధపడుతున్నానంటున్న బాద్‌షా కూతురు!
Suhana Khan On Trolls And Leaked Pics బాధపడుతున్నానంటున్న బాద్‌షా కూతురు!

సెలబ్రిటీలనే కాదు.. మరీ ముఖ్యంగా సినీ ప్రముఖుల పిల్లలు కూడా సెలబ్రిటీలుగానే చలామణి అవుతుంటారు. వారు ఏమి చేసినా అందరి దృష్టి దానిపైనే పడుతుంది. దానికి ప్రశంసలు, విమర్శలు రావడం కూడా సహజమే. ఇక బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ కూతురు, గారాల పట్టి, 18ఏళ్ల సుహానాఖాన్‌కి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల ఆమె టూపీస్‌ బికినీ వేసిన ఫొటోలను పోస్ట్‌ చేసి విమర్శల పాలైంది. ఈ ఫొటోలో షారుఖ్‌ చిన్నకుమారుడు అబ్‌రామ్‌ ఉండటం మరింత వివాదాస్పదం అయింది. 

తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సుహానా స్పందించింది. ఇంట్లో వారికి లేని అభ్యంతరం బయటి వారికి ఎందుకు? ఇంట్లో బాగానే ఉంది. బయటే కష్టంగా ఉంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో ఈ ధోరణి విపరీతంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు నా పర్సనల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి లీక్‌ అయ్యాయి. వారికి విషయం తెలియకపోయినా కూడా అంతా తెలిసినట్లు మాట్లాడుతూ నన్ను విమర్శిస్తున్నారు. విమర్శలు చేసే బుద్ది ఉన్న వారు విమర్శలు చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విమర్శలతో నేను బాధపడటం లేదని చెప్పను. ఎంతో బాధగానే ఉంటోంది. విమర్శించే వారికి నేను ఓ సమస్యగా మారాను....!

Suhana Khan On Trolls And Leaked Pics:

Shah Rukh Khan's daughter Suhana Khan gets trolled for wearing a bikini