రాబోయే మూడు సినిమాల్లో ఈ సినిమానే టాప్..!

Wed 01st Aug 2018 11:54 PM
chi la sow,promotions,naga chaitanya,samantha,rahul ravindran,chinmayi  రాబోయే మూడు సినిమాల్లో ఈ సినిమానే టాప్..!
Naga Chaitanya and Samantha promotes Chi La Sow Movie రాబోయే మూడు సినిమాల్లో ఈ సినిమానే టాప్..!
Sponsored links

ఈ శుక్రవారం ఏకంగా ముగ్గురు హీరోలు మీడియం బడ్జెట్స్ తో బాక్సాఫీసు సమరానికి సై అంటున్నారు. అక్కినేని నాగేశ్వరావు మనవడు సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా చి. ల. సౌ సినిమా, క్షణం హీరో అడవి శేష్ హీరోగా.. గూఢచారి సినిమా, మారుతీ పర్యవేక్షణలో తెరకెక్కిన బ్రాండ్ బాబు సినిమాలు మూడు ఈ శుక్రవారం బరిలో ఉన్నాయి. మరి మూడు సినిమాలకు భారీ అంచనాలైతే లేవుగాని... మంచి అంచనాలే ఉన్నాయి. మూడు సినిమాలకు తమకి తోచిన విధంగా ప్రమోషన్స్ చేస్తూ తమ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. అయితే అన్ని సినిమాల్లో చి. ల. సౌ ప్రమోషన్స్ ఒక రేంజ్ లో కనబడుతున్నాయి. 

ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్స్ కి అక్కనేని యువ జంట అంటే నాగ చైతన్య - సమంతలు తమ వంతు సహాయం అందిస్తున్నారు. నిన్నటికి నిన్న చైతు, సామ్ లు చి. ల. సౌ ప్రెస్ మీట్ లో హల్చల్ చెయ్యడమే కాదు.. సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు. అలాగే 3 డేస్ టు గో, 2 డేస్ టు గో పోస్టర్స్ తో చి. ల. సౌ సినిమా విడుదల కౌండౌన్ ని కూడా మొదలెట్టేసారు. మరి 'చి. ల. సౌ' ప్రమోషన్స్ తో పోలిస్తే అడవిశేష్ గూఢచారి ప్రమోషన్స్ అండ్ మారుతీ బ్రాండ్ బాబు ప్రమోషన్స్ కాస్త వీక్ గా అనిపిస్తున్నాయి. ఇక చి. ల. సౌ సినిమాతో ఈసారి సుశాంత్ డీసెంట్ హిట్ అందుకునేలానే కనబడుతున్నాడు. 

ఇక చి.ల.సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కోసం ఆయన  వైఫ్ మరియు సమంత ఫ్రెండ్ అయిన చిన్మయి కూడా రంగంలోకి దిగి నిన్న చి. ల. సౌ ప్రెస్ మీట్ లో హడావిడి చేసింది. మరి మొత్తంగా మూడు సినిమాల్లో పాజిటివ్ బజ్ ని కాస్త ఎక్కువ సొంతం చేసుకుంటున్న సినిమా చి. ల. సౌ అన్నట్లుగానే కనబడుతుంది. మరి చి. ల సౌ ప్రమోషన్స్ తో మిగతా రెండు సినిమాలకు గట్టి పోటీనిస్తుందనడంలో సందేహమే లేదు.

Sponsored links

Naga Chaitanya and Samantha promotes Chi La Sow Movie:

Chi La Sow in Full Swing Than Other Movies

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019