ఈ వారం ఫైట్ లో మూడు సినిమాలు ఇవే..!

Tue 31st Jul 2018 09:20 PM
chi la sow,goodachari,brand babu,ready to release,friday fight  ఈ వారం ఫైట్ లో మూడు సినిమాలు ఇవే..!
Chi La Sow vs GoodaChari vs Brand Babu ఈ వారం ఫైట్ లో మూడు సినిమాలు ఇవే..!
Sponsored links

గత వారంలో రెండు సినిమాలు పోటా పోటీగా బాక్సాఫీసు వద్ద దిగాయి. 'హ్యాపీ వెడ్డింగ్, సాక్ష్యం' సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదన్నట్టుగా ఉంది బాక్సాఫీసు వ్యవహారం. గత నెల రోజులుగా ఒక్క ఆయా మన్న సినిమా లేక బోర్ కొట్టేసిన ప్రేక్షకులు ప్రతి వారం మంచి సినిమా ఏదన్నా విడుదలవుతుందేమో అంటూ ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ప్రతి వారం ఉసూరుమనిపించే సినిమాలే వస్తున్నాయి. ఇక ఈ వారం మరో మూడు సినిమాలు బాక్సాఫీసు బరిలోకి దిగబోతున్నాయి. మూడు సినిమాల్లో పెద్ద స్టార్ హీరోల సినిమా లేమీ లేవు. అందరూ ఓ మాదిరి హీరోలే. మరి ముగ్గురు యువ హీరోల మూడు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయో కాస్త వెయిట్ అండ్ సి.

ఈ వారం విడుదలయ్యే మూడు సినిమాల్లో 'చి. ల.సౌ, గూఢచారి, బ్రాండ్ బాబు' సినిమాలు ఉన్నాయి. ఒక సినిమాకి పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంటే.. మరో సినిమాకి హీరో మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇక మిగిలిన సినిమాకి ఒక పేరున్న దర్శకుడి అండ ఉంది. మరి అందులో 'చి ల సౌ' సినిమాకి అక్కినేని ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెళ్లి బ్యాగ్డ్రాప్ లో ఉండబోతుంది. సినిమా చూసి అన్నపూర్ణ బ్యానర్ నుండి విడుదల చేసేందుకు సిద్దమైన సమంత అండ్ నాగ చైతన్య ల క్రేజ్ ఈ సినిమాకి క్రేజ్ వచ్చేలా చేస్తుంది. 'చి ల సౌ' సినిమా ట్రైలర్ చూస్తుంటే ఈసారి సుశాంత్ కి హిట్ ఖాయమనిపిస్తుంది.

ఇక రెండో సినిమా 'క్షణం, దొంగాట' సినిమాల్తో డిఫ్రెంట్ కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అడవి శేష్ 'గూఢచారి' సినిమా. 'క్షణం' సినిమాలో తన ప్రేయసి కుమార్తెను వెతకడానికి అష్టకష్టాలు పడి ఆఖరికి వెతుకుతున్నది తన సొంత కూతురే అని తెలుసుకున్న వ్యక్తిగా అడవి శేష్ నటన అద్భుతమే. హీరోగా మెల్లగా ఎదుగుతున్న అడవి శేష్ అనేక సినిమాల్లో నెగెటివ్ రోల్స్ కూడా చేసాడు. మరి 'గూఢచారి' సినిమా మీద ట్రేడ్ లో మంచి అంచనాలే వున్నాయి. ఇక చివరిగా దర్శకుడి మారుతి పర్యవేక్షణలో... తానే కథ అందించిన 'బ్రాండ్ బాబు' కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా  మీద కూడా జనాల్లో ఆసక్తి ఉంది. ఎందుకంటే దర్శకుడు మారుతీ  సినిమా అంటే ఆటోమాటిక్ గా ఒక రేంజ్ క్రేజ్ ఆ సినిమాకి వచ్చేస్తుంది కాబట్టి. 

ఇక ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలకు పనిచేసిన ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వారెవరంటే 'గూఢచారి' హీరో అడవిశేష్, 'చి. ల. సౌ' డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇక 'గూఢచారి' సినిమా ఫైనల్ కట్ చూశాడట రాహుల్ రవీంద్రన్. అలాగే అడవి శేష్ తన సినిమా రిలీజ్ డేట్ ముందుగా రాహుల్ కే చెప్పాడట. మరి ఇద్దరు తమ రెండు సినిమాలు బాగా ఆడతాయనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. చూద్దాం ఈ వారం బాక్సాఫీసు విజేత ఎవరనేది.

Sponsored links

Chi La Sow vs GoodaChari vs Brand Babu:

This Week Release Movies Details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019