సమంత చమత్కారానికి నవ్వులే నవ్వులు!

Mon 30th Jul 2018 06:32 PM
samantha,seema raja,u turn,marriage,funny,netizen  సమంత చమత్కారానికి నవ్వులే నవ్వులు!
Samantha Eloped With Unknown Person! సమంత చమత్కారానికి నవ్వులే నవ్వులు!
Advertisement
Ads by CJ

నేటి సాంకేతిక యుగంలో మనిషి తన మేధస్సు ద్వారా ఏదైనా సృష్టించడం సామాన్యమైపోయింది. దీనికి కాస్త క్రియేటివిటీ, సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలు. ఇలా సినీ సెలబ్రిటీలను మార్ఫింగ్‌తో ఆటాడుకునే వ్యక్తులు, నెటిజన్లు కూడా ఉన్నారు. ఇక అక్కినేని కోడలు సమంత సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా, సరదాగా, చురుగ్గా ఉంటూ ఉంటుంది. అభిమానులు కూడా అంతే ఉత్సాహంతో ఆమెతో మాట్లాడాలని ట్వీట్స్‌ చేస్తూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా సామ్‌ ఈ ట్వీట్టకు సమాధానం ఇస్తూ ఉంటుంది.

తాజాగా ఓ అభిమాని సమంత పెళ్లిఫొటోని మార్ఫింగ్‌ చేసి ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. అది ఆమె పెళ్లి సందర్భంగా దిగిన ఫొటో. కానీ ఇందులో నాగచైతన్య స్థానంలో సమంత పక్కన మరో కుర్రాడు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తితో పాటు సమంత పెళ్లి సందర్భంగా మెడలో పూలదండలతో పక్కపక్కన కనిపిస్తూ ఉన్నారు. ఈ అభిమాని ఈ ఫోటోను పోస్ట్‌ చేస్తూ 'ఏమిటిది? సమంత' అని ప్రశ్నించాడు. 

దానికి సామ్‌ చాలా సరదాగా సమాధానం చెప్పింది. గత వారం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇది ఎలా లీక్‌ అయిందో అర్ధం కావడం లేదు. 'మాది తొలి చూపులోనే కలిగిన ప్రేమ' అంటూ సమాధానం ఇచ్చింది. ఊహించని రీతిలో సామ్‌ ఇచ్చిన సమాధానం చూసి పలువురు నవ్వుకున్నారు. 'నీ చమత్కారానికి నవ్వు ఆపుకోలేకపోతున్నాం. చట్టప్రకారం ఇది పెద్ద నేరం సామ్‌... సూపర్‌, హోగాడ్‌' అంటూ నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. 

Samantha Eloped With Unknown Person!:

Samantha Eloped Pic Leaked!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ