తమన్నా... ఎందుకంత కోపం..!

Tamannah Condemns Marriage Rumours

Sun 29th Jul 2018 11:08 AM
Advertisement
tamannah,rumours,marriage,tollywood  తమన్నా... ఎందుకంత కోపం..!
Tamannah Condemns Marriage Rumours తమన్నా... ఎందుకంత కోపం..!
Advertisement

రెండు రోజుల క్రితం హీరోయిన్ తమన్నాకి ఒక అమెరికా డాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ తో వివాహం జరగబోతుందంటూ మీడియాలో తమన్నా పెళ్లి వార్తలు తెగ హల్చల్ చేశాయి. ఇప్పటికే తమన్నా పేరెంట్స్.. ఆ వరుడు డాక్టర్, పేరెంట్స్ ఇద్దరూ మాట్లాడుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేయబోతున్నారని.. అసలిప్పటికే నిశ్చితార్ధం అయ్యిందని.. ఇలా రకరకాల వార్తలు సోషల్, వెబ్ మీడియాలో వచ్చాయి. ఇక పెళ్లిపై తర్వాత తమన్నా సినిమాలు కంటిన్యూ చేస్తుందా.. లేక అవకాశాలు లేవు కదా అని డాక్టర్ తో అమెరికాలో సెటిల్ అవుతుందా అంటూ రకరకాల న్యూస్ లు హల్చల్ చేశాయి కూడా. మరి ప్రస్తుతం తాను నటిస్తున్న  తెలుగు క్వీన్ సినిమా పూర్తి కాగానే .. 'సై రా నరసింహారెడ్డి' వంటి బిగ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న  తమన్నా... వెంకటేష్ సరసన ఎఫ్ 2 లో కూడా వన్ అఫ్ ద హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక తాజాగా తన పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించింది. 

తాను పెళ్లి చేసుకుంటున్నానని వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని... అసలు ఒకరోజు సినిమా హీరోని, మరోసారి క్రికెటర్ ని, ఇంకోసారి డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలను చూస్తుంటే నేనేదో పెళ్లికొడుకుల్ని షాపింగ్ చేస్తున్నట్టుగా ఉంది... అసలు నా పర్సనల్ విషయాల మీద ప్రూఫ్ లేని వార్తలు పుట్టిస్తే ఊరుకునేది లేదని.. అసలు నేను ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు.. అలాగే నా పేరెంట్స్ కి కూడా పెళ్లి విషయంలో ఎలాంటి తొందరా లేదు.. ఇక నేను చాలా సినిమాలతో బాగా బిజీగా వున్నాను.. ఇప్పటి వరకైతే సినిమాలనే ప్రేమిస్తున్నాను... అంటూ తన ట్విట్టర్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. తన పెళ్లి పుకార్లని ట్విట్టర్ లోని లెటర్ తో ఫుల్ స్టాప్ పెట్టింది. మరి ఎప్పుడు తన పెళ్లి వార్తలపై స్పందించని తమన్నా ఈసారి మాత్రం తెగ ఫైర్ అయ్యింది.

అయినా వయసొచ్చాక పెళ్లి చేసుకోవాలి గాని.. వయసై పోయినా పెళ్లి మాటెత్తితే ఇలా అంతెత్తున లేవడం అవసరమా.. ఏదో నాకు పెళ్లి కుదరలేదు.. అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ స్పందిస్తే సరిపోయే దానికి... ఇంత పెద్ద లెటర్ అవసరమా తమన్నా.. అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement

Tamannah Condemns Marriage Rumours :

Tamannah Quashes Rumours  

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement