మహేష్‌తో చిత్రం ఖచ్చితంగా ఉంటుంది...!

Sat 28th Jul 2018 12:33 AM
sai madhav burra,mahesh babu,krish,confirmed  మహేష్‌తో చిత్రం ఖచ్చితంగా ఉంటుంది...!
Sai Madhav Burra Confirmed Mahesh and Krish Movie మహేష్‌తో చిత్రం ఖచ్చితంగా ఉంటుంది...!
Sponsored links

క్రియేటివ్‌ దర్శకుడు క్రిష్‌ తెలుగు తెరకు అందించిన అద్భుతమైన రైటర్‌గా సాయిమాధవ్‌ బుర్రా నేడు స్టార్‌ స్టేటస్‌ని అనుభవిస్తున్నాడు. 'గౌతమీ పుత్రశాతకర్ణి, ఖైదీనెంబర్‌ 150, గోపాల గోపాల, మహానటి'ఇలా ఆయన కెరీర్‌ అనతి కాలంలోనే దూసుకెళుతోంది. ఇక విషయానికి వస్తే గతంలో దర్శకుడు క్రిష్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయనున్నాడని చెప్పి కొన్ని టైటిల్స్‌ కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. దాంతో ఇక ఈ చిత్రం ఉండదనే అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ ఇది ఓ అద్భుతమైన కథ అని సాయిమాధవ్‌ బుర్రా తాజాగా చెప్పుకొచ్చాడు. 

మూడు నాలుగేళ్ల కిందట క్రిష్‌, మహేష్‌బాబులతో నేను ఓ చిత్రం చేయాల్సివుంది. కానీ ఈ చిత్రానికి విచిత్రమైన ఆటంకాలు ఎదురయ్యాయి. క్రిష్‌ ఖాళీగా ఉన్నప్పుడు మహేష్‌ బిజీగా ఉండటం, మహేష్‌ ఖాళీగా ఉన్నప్పుడు క్రిష్‌ బిజీగా ఉండటం జరుగుతూ వస్తోంది. ఈ చిత్రం పట్టాలెక్కకపోవడానికి ఇది తప్ప మరో కారణం లేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను. ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్‌ ఖచ్చితంగా ఉంటుంది. చాలా గొప్ప కథ అది. అందువల్ల వీలైన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకుని వెళ్తామని క్లారిటీ ఇచ్చాడు. 

ఇక మహేష్‌ ఒకవైపు తన 25వ చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్‌లతో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మరో చిత్రం.. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు క్రిష్‌ కూడా బాలీవుడ్‌లో కంగనారౌనత్‌ 'మణికర్ణిక', తెలుగులో బాలకృష్ణ హీరోగా 'ఎన్టీఆర్‌'బయోపిక్‌లతో బిజీ బిజీ. మధ్యలో సాయిమాధవ్‌ బుర్రా పలు చిత్రాలతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్‌ చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి' వంటి వాటిల్లో ముగ్గురూ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కాలంటే ఇంకా చాలా కాలం పట్టే అవకాశం ఉంది. 

Sponsored links

Sai Madhav Burra Confirmed Mahesh and Krish Movie:

Mahesh and Krish Movie Soon, Says Sai Madhav Burra 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019