నితిన్ ని నమ్మి, ప్రయోజనం లేదనుకుంది!

Fri 27th Jul 2018 08:28 PM
megha akash,nithin heroine,tollywood,kollywood  నితిన్ ని నమ్మి, ప్రయోజనం లేదనుకుంది!
Nithiin Heroine Goes to Kollywood నితిన్ ని నమ్మి, ప్రయోజనం లేదనుకుంది!
Sponsored links

మేఘ ఆకాష్.. నితిన్ ని నమ్ముకుని తెలుగులో వెంట వెంటనే రెండు సినిమాలు చేసింది. మేఘ నటించిన రెండు తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. నితిన్ తో టాలీవుడ్ కి 'లై' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మళ్లీ వెంటనే నితిన్ తోనే 'ఛల్ మోహన్ రంగ' సినిమాలో నటించింది. రెండు సినిమాలు మేఘ ఆకాష్ కి చుక్కలు చూపెట్టాయి. ఇక తెలుగులో మేఘ ఆకాష్ పనై పోయిందని వార్తలు షికారు చేశాయి. మధ్యలో మేఘ ఆకాష్ కి శర్వానంద్ సినిమాలో అవకాశం వచ్చిందనే టాక్ కూడా నడిచింది. అయితే ఇక్కడ తెలుగులో ఏమో కానీ మేఘ పక్క రాష్ట్రం కోలీవుడ్ లో తేలింది. 

కోలీవుడ్ లో స్టార్ హీరో ధనుష్ సరసన 'ఎన్నై నోక్కి పాయిమ్ తొట్టా' అనే రొమాంటిక్ థ్రిల్లర్ లో నటిస్తుంది. ప్రస్తుతం 'ఎన్నై నోక్కి పాయిమ్ తొట్టా' టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. మరి ఈ టీజర్ లో హీరో హీరోయిన్స్ ఎక్సప్రెషన్స్ తప్పితే ఎలాంటి డైలాగ్స్ లేకుండా... హీరో హీరోయిన్స్ మధ్యలో గల రొమాంటిక్ యాంగిల్ ని చాలా అందంగా చూపించాడు దర్శకుడు. ధనుష్ అండ్ మేఘ ఆకాష్ కలసి లుక్స్ కి సరిపడా లొకేషన్స్ ని అలాగే హీరో హీరోయిన్స్ కి మధ్య లిప్ లాక్ కిస్సులు, అలాగే ఎమోషన్స్ ని అన్నిటిని చిన్న డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతో ఆకట్టుకునేలా చేశాడు.

మరి ఈ సినిమాలో కొత్తగా కనబడుతున్న మేఘ ఆకాష్... ఈ సినిమాతో హిట్ కొట్టి కనీసం కోలీవుడ్ లో అయినా తనని తాను ప్రూవ్ చేసుకుని నిలబడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ టీజర్ చూస్తుంటే కొత్తగా కనబడుతుంది. అలాగే హిట్ అయ్యే లక్షణాలు కూడా బాగానే కనబడుతున్నాయి. పోనీలే ఇక్కడ తెలుగులో హిట్ కొట్టలేకపోయినా.. కనీసం కోలీవుడ్ లో అయినా మేఘ హిట్ కొట్టి నిలదొక్కుకోవాలని ఆశిద్దాం.

Sponsored links

Nithiin Heroine Goes to Kollywood:

Megha Akash to Busy in Kollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019