ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NTR, Nagababu Leaked Pic From Aravinda Sametha Veera Raghava

'అరవింద సమేత' మరొకటి లీకైంది..!

NTR, Nagababu Leaked Pic From Aravinda Sametha Veera RaghavaNTR, Nagababu Leaked Pic From Aravinda Sametha Veera Raghava

జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న అరవింద సమేత - వీర రాఘవ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో  చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాలేజ్ సెట్ కి సంబందించిన షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. ఆ కాలేజ్ సెట్ లో హీరోయిన్ పూజా హెగ్డే, ఎన్టీఆర్ ల మీద కాలేజ్ సీన్స్ ని తెరకెక్కించారట.  రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈసినిమాలో ఫ్యాక్షన్ కక్షలు.. అనేది కామన్ పాయింట్. ఇకపోతే ఈసినిమాలో మరో హీరోయిన్ ఈషా రెబ్బ కూడా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఈషా.. ఎన్టీఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లా కనబడనుందని సమాచారం

ఇంకా ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో మెగా హీరో నాగబాబు నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని యాక్షన్ అండ్ ఫ్యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా... తాజాగా అరవింద సమేత లో ఆ యాక్షన్ పార్ట్ కి సంబందించిన ఒక పిక్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. నాగబాబు - ఎన్టీఆర్ లకు సంబందించిన వర్షంలో తీసిన ఓ సీన్ కు సంబంధించిన పిక్ లీకైంది. ఆ పిక్ లో ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా టెంక్షన్ గా నాగబాబు అంటే తన తండ్రిని ఎలాగైనా బతికించుకోవాలని తపనతో కనబడుతున్నాడు. ఇక నాగబాబుకు గాయాలు అయ్యాయి కానీ.. అవి ఎలాంటి గాయాలో ఈ పిక్ లో స్పష్టత లేదు.  కాకపోతే ఆ కారులో కళ్లు మూసుకుపోయి, తల పక్కకు వాల్చిన నాగబాబును.... ఎన్టీఆర్ దీనంగా చూస్తూ... గడ్డం పట్టుకుని లేపుతున్నట్టు మాత్రమే కనిపిస్తోంది.

మరి అరవింద సమేత షూటింగ్ స్పాట్ నుండి ఈ పిక్ ఎవరు లీక్ చేశారో తెలియదు గాని.. ఇప్పుడా ఎమోషనల్ పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఆ వైరల్ గా మారిన అరవింద సమేత పిక్ ని మీరు ఓ లుక్కేయండి. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.

NTR Too Kills Nagababu

naga babu
jr ntr
aravinda sametha
leaked pic