హీరోయిన్ బరువు, భాద్యత హీరో చేతుల్లో..!

Sat 21st Jul 2018 12:33 PM
vijay devarakonda,geetha govindam,teaser,poster,july 22  హీరోయిన్ బరువు, భాద్యత హీరో చేతుల్లో..!
Geetha Govindam Movie Teaser Release Poster హీరోయిన్ బరువు, భాద్యత హీరో చేతుల్లో..!
Sponsored links

అర్జున్‌రెడ్డి చిత్రంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ, 'కిర్రాక్‌పార్టీ'తో కన్నడలోనే కాక దేశవ్యాప్తంగా చూపును తనవైపుకు తిప్పుకున్న రష్మిక మండన్న వంటి ఆసక్తికర జోడీ ప్రస్తుతం 'గీతగోవిందం' చిత్రంలో కలిసి నటిస్తోంది. పలు హిట్‌ చిత్రాలను తీసిన పరుశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాస్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గోపీసుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని మొదటి పాట ఈనెల 10వ తేదీన యూట్యూబ్‌లో విడుదలై 8రోజుల్లోనే కోటి వ్యూస్‌ని సాధించి రికార్డు క్రియేట్‌ చేసింది. 

ఇక ఈ పాటే కాదు. .. ఈ చిత్రం పోస్టర్‌, టీజర్‌ వంటివన్నీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబడుతున్నాయి. ఇందులో గీతగా రష్మిక మండన్న, గోవిందంగా విజయ్‌ దేవరకొండ నటిస్తున్నారు. ఇప్పటికే మొదలైన టీజర్‌, ప్రమోషన్స్‌లో రష్మికాను విజయ్‌ మేడమ్‌.. మేడమ్‌ అని సంబోధిస్తూ ఉండటం ఎంతో ఫన్నీగా ఉంది. 

కాగా ఈ చిత్రం టీజర్‌ విడుదల తేదీని విజయ్‌దేవరకొండ ప్రకటించాడు. ఈనెల 22న టీజర్‌ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆయన ఓ వైవిధ్యభరితమైన పోస్టర్‌ని విడుదల చేశాడు. ఈ పోస్టర్‌కి 'ఐ లవ్‌ హర్‌ బరువు.. బాధ్యత' అనే క్యాప్షన్‌ని ఇచ్చాడు. పోస్టర్‌లో గీతను గోవిందం భుజాన మోయడం ఆకట్టుకుంటూ ఉంది. ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదలకు సిద్దమవుతోంది. 'అర్జున్‌రెడ్డి' తర్వాత పూర్తి నిడివి కలిగిన హీరో పాత్రను విజయ్‌ దేవరకొండ చేస్తున్న చిత్రంపై విడుదలకు ముందే భారీ అంచనాలుండటం విశేషం. 

Sponsored links

Geetha Govindam Movie Teaser Release Poster:

Geetha Govindam Teaser on July 22

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019