Advertisement

ఇండియా, ఇంగ్లండ్‌ మ్యాచ్ సాక్షిగా ప్రేమ!

Mon 16th Jul 2018 08:59 PM
lords,couple,engaged,india england 2nd odi  ఇండియా, ఇంగ్లండ్‌ మ్యాచ్ సాక్షిగా ప్రేమ!
Match Made in Heaven: A Marriage Proposal at Lord's ఇండియా, ఇంగ్లండ్‌ మ్యాచ్ సాక్షిగా ప్రేమ!
Advertisement

ప్రతి ఒక్కరి ప్రేమలోనూ అబ్బాయి అమ్మాయికి, లేదా అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్‌ చేయడం అనేది అత్యంత కీలక ఘట్టం. ఎక్కువగా అబ్బాయిలు అమ్మాయిలకు ముందుగా ప్రపోజ్‌ చేయించుకుంటూ వారి నుంచి యస్‌ ఆర్‌ నో అనే సమాధానం రాబట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా లవ్‌ని తోటి వారికి, తమకి నచ్చిన వారికి ప్రపోజ్‌ చేయడంలో యువత కూడా వినూత్నంగా ఆలోచిస్తూ, దానికి తగ్గ సమయాన్ని, సందర్భాన్ని అద్భుతంగా ఎంచుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే భారతీయులలోనే కాదు.. బ్రిటీష్‌ సామ్రాజ్యం సాగిన దేశాలన్నింటిలో క్రికెట్‌కి అద్భుతమైన ఆదరణ ఉంది. ఇంగ్లీష్‌ మెన్‌ ఆటే అయినా అది భారతదేశంలో, భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా ఈ ఆటని ఓ మతంలా మన వారు భావిస్తారు. 

ఇక క్రికెట్‌కి మక్కా వంటిది లండన్‌లోని లార్డ్స్‌మైదానం. ఈ మైదానంలో తాజాగా ఇంగ్లండ్‌, ఇండియా టీంల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరిగింది. ఇందులో భారత్‌ ఓడిపోయినప్పటికీ టీవీలను అతుక్కున్న వారికి మాత్రం ఒక విషయం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ జరిగే సమయంలో ఒక అబ్బాయి ఓ అమ్మాయికి ప్రపోజల్‌ చేశాడు. దానికి సిగ్గు పడుతూనే ఆ యువతి తన అంగీకారం తెలిపింది. చుట్టు ఉన్న వారు హర్షాతిరేకంగా ఆనందంతో చప్పట్లు కొట్టి మారుమోగేలా చేశారు. 

దీనినంతా ఓ వీడియోలో బంధించిన ఓ అభిమాని దానిని సోషల్‌ మీడియాలో పంచుకోగా లార్డ్స్‌ మైదానం మొత్తం స్పందించింది. గత ఏడాది కూడా ఇదే మైదానంలో ఓ జంట ఒకటైందని, ఇక్కడ వ్యక్తం చేసుకున్న ప్రేమ కలకాలం ఉంటుందని ఇదే మైదానంలో గతంలో ఒకటైన వారు గొప్పగా చెబుతున్నారు.

Match Made in Heaven: A Marriage Proposal at Lord's :

Proposal at Lord's, couple gets engaged during India-England 2nd ODI

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement