ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fahad Fazil in Rajinikanth and Karthik Subbaraj movie

రజిని సినిమాలో ఈ నటుడు కూడా..!!

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అతని ప్రతి సినిమాలోనూ ప్రతి పాత్రనూ బలంగా తీర్చిదిద్దుతుంటాడు. అలానే ఈ సినిమాలో కూడా రజిని ఒక్కడి పాత్రే హైలైట్ చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుల క్యారెక్టర్లూకు.. విలన్‌ పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటున్నాడట.

ఇందులో తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈ చిత్రంలో సిమ్రాన్.. కాజల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ లో మరో స్పెషల్ నటుడు జాయిన్ అయ్యాడంట. మలయాళంలో చాలా గొప్ప గొప్ప పాత్రలలో నటించి.. నటుడిగా మంచి పేరుతో పాటు.. తన నటనకు నేషనల్ అవార్డు అందుకున్న ఫాహద్ ఫాజిల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడంట.

రజిని సినిమా అంటే ఇండియా వైడ్ బజ్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా రజినితో పాటు ఇంత మంది స్టార్ ఆర్టిస్ట్స్ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫాహద్ ఫాజిల్ నెక్స్ట్ షెడ్యూల్ నుండి ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వబోతున్నాడట. రీసెంట్ గా డార్జిలింగ్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం.. మధురైలో త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలుపెట్టనుంది. అందులో ఫాహద్ ఫాజిల్ పాల్గొననున్నాడు.

Fahad Fazil is expected to join the sets of Karthik Subburaj's untitled movie with Rajinikanth

Fahad Fazil in Rajinikanth and Karthik Subbaraj movie
fahad fazil
karthik subburaj movie
rajinikanth
malayalam actor
Advertisement
Advertisement