తమిళనాటే కాదు.. దేశవ్యాప్తంగా గర్వించదగ్గ నటుడు కమల్‌హాసన్‌కి ముఖ్యంగా తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. కాగా ఈయన నటించగా విడుదలై ఘన విజయం సాధించిన 'విశ్వరూపం'కి సీక్వెల్‌గా రూపొందిన 'విశ్వరూపం 2'ని ఎంతో కాలం జాప్యం తర్వాత కమల్ విడుదలకు రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆల్‌రెడీ తన సొంతం చేసుకున్న కమల్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఆగష్టు 10న విడుదల చేస్తామని ఆల్‌రెడీ ప్రకటించాడు. భారీతనంతో పాటు కమల్ నటన, దర్శకత్వ ప్రతిభ, వైవిధ్యమైన స్టోరీలతో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక తాజాగా అదే రోజున కమల్‌కి పోటీగా అన్నట్లు కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన 'కొలమావు కోకిల' కూడా విడుదల కానుంది. కోలీవుడ్‌లో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. కథల ఎంపిక, పాత్రల్లో వైవిధ్యం, అద్భుతమైన నటన వంటి లక్షణాలన్నీ ఆమెని లేడీ సూపర్‌స్టార్‌ని చేశాయి.
ఇక 'కొలమావు కోకిల'కు నెల్సన్ దర్శకత్వం వహిస్తుండగా, సంగీత సంచలనం అనిరుద్ మ్యూజిక్‌ని అందించాడు. మరి ఈ కమల్, నయనల పోటీలో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సివుంది...! ఎందుకంటే 'కొలమావు కోకిల'ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడంతో విడుదలను కూడా భారీ ఎత్తున చేయనున్నారు. సో.. ఆగష్టు10దాకా వెయిట్ చేస్తేగానీ ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనేది చెప్పలేం.




టీజర్ అదిరింది: కుమారబాబు హిట్ కొడతాడా?

Loading..