ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Payal Rajput Remuneration For RX 100 Movie

అన్ని ముద్దులిచ్చినా.. 6 లక్షలేనా?

కేవలం ట్రైలర్ తో ఓ సినిమాను ప్రమోట్ చేయొచ్చు అంటే చేయొచ్చు అనే చెబుతున్నారు 'ఆర్ ఎక్స్ 100' టీం. కేవలం ఒక ట్రైలర్ తోనే థియేటర్స్ కు జనాలను రప్పించేలా చేసారు మేకర్స్. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల అయిన ప్రతి చోట విజయవిహారం చేస్తోంది.

ప్రస్తుతం అంతా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ తీసుకున్న పారితోషికం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇందులో రొమాన్స్ బాగా ఎక్కువ అని చూసిన వాళ్లకి అర్ధం అవుతుంది.  ఈ సినిమాలో లిప్ లాక్ లు చాలానే ఉంటాయని డైరెక్టర్ అజయ్ భూపతి ముందుగానే చెప్పడం వలన.. చాలామంది హీరోయిన్స్ రిజెక్ట్ చేసారంట.

ఒకానొక టైములో ఈ సినిమాకు హీరోయిన్ దొరకటం కష్టం అయిపోయిందంట. అలా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో సెలెక్ట్ అయిందట. మరీ ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువే కాబట్టి పారితోషికం కూడా బాగానే తీసుకుని ఉంటదని అంత అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా కోసం కేవలం 6 లక్షలే తీసుకుందట. ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించే అంత మాట్లాడుకుంటున్నారు.

Do you know how much Payal Rajput was paid for 'RX 100'?

Payal Rajput Remuneration For RX 100 Movie
payal rajput
remuneration
rx 100 movie
ajay bhupathi