Advertisementt

హీరోపై.. కత్రినా పంచులే పంచులు..!

Mon 09th Jul 2018 10:10 PM
katrina kaif,arjun kapoor,response,counters,katrina kaif photo,troll  హీరోపై.. కత్రినా పంచులే పంచులు..!
Katrina stunning new photo gets trolled by Arjun Kapoor హీరోపై.. కత్రినా పంచులే పంచులు..!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస పరాజయాల వల్ల ఐరన్‌లెగ్‌గా ముద్రపడిన నటి కత్రినాకైఫ్‌. ఈమె తెలుగు ప్రేక్షకులకు 'మల్లీశ్వరి' చిత్రం ద్వారా బాగా పరిచయం. ఇక ఈమె ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ స్టార్‌హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవలే తన మాజీ బోయ్‌ఫ్రెండ్‌ సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టి 'టైగర్‌ జిందాహై'తో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకుంది. 

ఇక తాజాగా ఈమెని బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌పూర్‌ ఆటపట్టిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయగా, ఆమె కూడా వాటికి సరైన గడుసు సమాధానాలు చెబుతూ, తానేం తక్కువ తినలేదని నిరూపించుకుంది. ఇక విషయానికి వస్తే తాజాగా కత్రినా ఓ స్లో మోషన్‌లో సాగే వీడియోను తన ఇన్స్ట్రాగ్రమ్‌లో పోస్ట్‌ చేసింది. దీనిని చూసిన అర్జున్‌కపూర్‌ ఫన్నీగా 'కత్రినా.. నీకు డాండ్రాఫ్‌ ఉందా' అని ప్రశ్నించాడు. దానికి కత్రినా సమాధానం ఇస్తూ 'బాధపడకు.. నాకు తెలుసు... నీకు కూడా ఇలా ట్రై చేయాలనిపిస్తోంది. మనిద్దరం దీనిని కలిపి చేద్దాంలే' అని రిప్లై ఇచ్చింది. 

ఆ తర్వాత కత్రినా పోస్ట్‌ చేసిన ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోపై అర్జున్‌ కపూర్‌ కామెంట్‌ చేస్తూ.. 'ప్రస్తుతం ఆల్‌క్లియర్‌. గుడ్‌జాబ్‌ కత్రినా' అంటూ ఆటపట్టించాడు. దానికి కత్రినా స్పాంటేనియస్‌గా స్పందిస్తూ, నాకు తెలుసు. నువ్వు ఈ ఫోజుని ట్రై చేద్దామని అనుకుంటున్నావు. నేను వచ్చాక నీకు నేర్పిస్తాలే..అని చెప్పింది. ఇక ప్రస్తుతం కత్రినా దబాంగ్‌ టూర్‌లో భాగంగా అమెరికాలో ఉంది. అమీర్‌ఖాన్‌, అమితాబ్‌బచ్చన్‌ కలిసి నటిస్తున్న 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్రంలో ఆమె నటిస్తోంది. 

Katrina stunning new photo gets trolled by Arjun Kapoor:

Katrina Kaif’s response to Arjun Kapoor’s comment on her photo

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ