తేజ్ సెన్సార్ టాక్ ఎలా వుంది అంటే ..!!

Mon 02nd Jul 2018 01:51 PM
anupama parameswaran,sai dharam tej,tej i love you,tej i love you censor talk  తేజ్ సెన్సార్ టాక్ ఎలా వుంది అంటే ..!!
Tej I Love You Censor Talk తేజ్ సెన్సార్ టాక్ ఎలా వుంది అంటే ..!!
Sponsored links

ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ - అనుపమ జంటగా తెరకెక్కిన తేజ్ ఐలవ్ యు రేపు శుక్రవారమే ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఈ సినిమా తో సాయి ధరమ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే... ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వరుస ప్లాప్స్ తో కొట్టుమిటాడుతున్నాడు. ఈ సినిమాతోనే సాయి ధరమ్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇక క్యూట్ భామ అనుపమ పరమేశ్వర్ కి ఇప్పటివరకు నటించిన సినిమాల్తో మంచి పేరు తెచ్చుకుంది. మరి అనుపమ కి ఈ సినిమా కూడా హిట్ అవుతుందని.. ఈ దెబ్బకి స్టార్ హీరోల పక్కన అవకాశాలు కొట్టెయ్యొచ్చని అనుకుంటుంది. ఇక దర్శకుడు కరుణాకరన్ నుండి కూడా హిట్ సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నాయి. మరి కరుణాకరన్ ఈ సినిమాతో విజయంసాధించాలని తహతహలాడుతున్నాడు. 

రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ప్రేమ కథ చిత్రం తేజ్ ఐ లవ్ యు ప్రస్తుతం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాని ఆసాంతం వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఈ సెన్సార్ సర్టిఫికెట్ చూస్తుంటే... తేజ్ ఐ లవ్ యు హిట్ అవుతుందనిపిస్తుంది.  ఇక సెన్సార్ సభ్యులు తేజ్ ఐ లవ్ యు సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించారు. అంటే ఈ సినిమా అటు యూత్ కి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుందని అంటున్నారు. ఇక ప్రేమ, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ తేజ్ ఐ లవ్ యు తో సాయి ధరమ్ తేజ హిట్ కొట్టేస్తాడులే అనిపిస్తుంది. అనుపమ క్యూట్ లుక్స్, అలాగే ఆమె ట్రెడిషన్ డ్రెస్సెస్, సాయి ధరమ్ డాన్స్ లాంటి స్పెషల్స్ తో ఈ సినిమా మీద మంచి అంచనాలు రావడంతో పాటుగా ఇప్పుడు సెన్సార్ కూడా పాజిటివ్ గా రావడంతో... మెగా ఫాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇక భారీ ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న తేజ్ ఐ లవ్ యు మరో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.

Sponsored links

Tej I Love You Censor Talk:

Tej I Love You Censor Report Leaked

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019