ఈ ఒక్క షెడ్యూల్ కే 'సైరా' షాకిస్తున్నాడుగా!!

Fri 29th Jun 2018 05:52 PM
sye raa,sye raa narasimha reddy,chiranjeevi,ram charan,action episode,40 crore  ఈ ఒక్క షెడ్యూల్ కే 'సైరా' షాకిస్తున్నాడుగా!!
Charan To Spend 40 Crore For A Fight Scene In Sye Raa Narsimha Reddy ఈ ఒక్క షెడ్యూల్ కే 'సైరా' షాకిస్తున్నాడుగా!!
Sponsored links

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న 'సై రా నరసింహ రెడ్డి' సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊపందుకుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటి నుండి నత్తనడకన సాగిన సై రా షూటింగ్ గత రెండు నెలల నుండి శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ కూడా బోయపాటి సినిమాలో నటిస్తూనే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా చూసుకుంటున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల పై మేర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ని హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన భారీ సెట్టింగ్ లో చిత్రీకరణ జరుపుతున్నారు.

అయితే ఆ భారీ సెట్ తో పాటు.. ఆ సెట్ లో జరిగే యుద్ధ సన్నివేశాలకు గాను దాదాపుగా 40 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ భారీ సెట్లో నరసింహారెడ్డికి - ఆంగ్లేయులకు మధ్య రాత్రివేళలో జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారు. సై రా సినిమాలో హైలెట్ గా నిలిచే ఈ సన్నివేశాలు భారీ తనంతో కూడుకున్నవిగా చెబుతున్నారు.  హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో నరసింహారెడ్డిలోని వీరోచిత నాయకుడిని ఆవిష్కరించే సన్నివేశాలుగా ఇవి ఉంటాయట. ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో భారీ సంఖ్యలో హాలీవుడ్ ఫైటర్స్ పాల్గొంటున్నారని చెబుతున్నారు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి ఈ వయసులోనూ రాత్రి పూట నిద్రలేకుండా కష్టపడుతున్నారట.

మరి హాలీవుడ్ స్టంట్ మాస్టర్, అండ్ హాలీవుడ్ ఫైటర్స్ అంటే.. భారీగానే ఖర్చు ఉంటుంది. అందుకే ఈ ఒక్క యాక్షన్ షెడ్యూల్ కే 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటేనే... అదెంత భారీతనంతో కూడుకున్నదో అర్ధమవుతుంది. ఇక ఈ యాక్షన్ సన్నివేశం కూడా సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే సన్నివేశమని..  హైలైట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు. మరి నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషల నటులు నటిస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్, సుదీప్, జగపతి బాబు వంటి మేటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Sponsored links

Charan To Spend 40 Crore For A Fight Scene In Sye Raa Narsimha Reddy:

Shocking: 40 Crore Budget to Sye Raa Action Episode

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019