ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాపై పిచ్చ క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్టయిల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం పై ట్రేడ్ లోను భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం దుబాయ్ లోని అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటున్న సాహో చిత్రానికి సంబందించిన బోలెడన్ని విషయాలు ప్రభాస్ పలు ఇంటర్వ్యూలో చెబుతున్నాడు. తాజాగా ప్రభాస్ ఫిల్మ్‌ఫేర్ మిడిలీస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సాహో కి సంబందించిన కొన్ని ముఖ్యమైన విషయాలను బయటపెట్టాడు. తనకి ముగ్గురు బాలీవుడ్ భామలంటే ఇష్టమని... అందులో దీపికా, కత్రినా, అలియాలు ఇష్టమని చెప్పాడు.
అలాగే సాహో సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ద కపూర్ ని ప్రభాస్ ఆకాశానికెత్తేశాడు. శ్రద్ద కపూర్ పనిలో డెడికేషన్ ఉన్న అమ్మాయని... అలాగే శ్రద్ద తెలుగు నేర్చుకోవడం చూస్తుంటే ముచ్చటేసిందని చెబుతున్నాడు ప్రభాస్. పలు భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం కోసం శ్రద్ధ కపూర్ తెలుగు నేర్చుకుంటుంటే.. ప్రభాస్ హిందీని ఔపోసన పడుతున్నాడు. అయితే ప్రభాస్ తనకొచ్చిన హిందీ కంటే.. శ్రద్ధా నేర్చుకున్న తెలుగు చాలా గొప్పదంటున్నాడు. సాహో సినిమా హిందీ వెర్షన్ కోసం తీసే పలు సీన్స్ లో తాను భాషాపరమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. తెలుగులో తీసే సీన్ల విషయంలో శ్రద్ధా కపూర్ మాత్రం చాలా అలవోకగా చేసేస్తుందని చెబుతున్నాడు.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమా షూటింగ్ ఇంకా దుబాయ్ లోని అబుదాబి పరిసర ప్రాంతంలోనే జరుగుతుందట. ఇక అక్కడే సినిమాలోని 11 పాత్రలకు సంబందించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను నెల రోజుల పాటు చిత్రీకరించి .. జూలై నెలాఖరున అక్కడి నుండి తిరిగి వస్తారని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ వారు లెక్కలేకుండా ఖర్చు పెడుతున్న ఈ సినిమాని వచ్చే వేసవి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో మూవీ యూనిట్ ఉంది.