'నా నువ్వే'... 'సమ్మోహనం' సైలెంట్ గా వస్తున్నాయి!

Wed 13th Jun 2018 03:11 PM
kalyan ram,sudheer babu,naa nuvve,sammohanam,release  'నా నువ్వే'... 'సమ్మోహనం' సైలెంట్ గా వస్తున్నాయి!
Naa Nuvve and Sammohanam Ready to Release 'నా నువ్వే'... 'సమ్మోహనం' సైలెంట్ గా వస్తున్నాయి!
Sponsored links

ఈ వారం టాలీవుడ్ లో రెండు మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కళ్యాణ్ రామ్ 'నా నువ్వే'.. ఇంకోటి సుధీర్ బాబు 'సమ్మోహనం'. ఈ రెండు సినిమాలపై అంతగా అంచనాలు ఏమి లేవు. తొలిసారిగా తమన్నా కళ్యాణ్ రామ్ పక్కన చేస్తుంది. రేడియో జాకీగా తమన్నా ఇందులో కనిపించబోతోంది. రేడియో జాకీతో కళ్యాణ్ రామ్ ఎలా ప్రేమలో పడ్డాడో అనేదే సినిమా. ఇది ఒక సెన్సిటివ్ ఎమోషనల్ లవ్ స్టోరీ.

ఇక నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. 'నాన్నకు ప్రేమతో' టైంలో తాను ఫేస్ చేసిన ఒత్తిడి ఇప్పుడు అన్నయ కళ్యాణ్ రామ్ ఈ సినిమా విషయంలో ఫేస్ చేస్తున్నాడని.. ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న.. కళ్యాణ్ రామ్ ని లవర్ బాయ్ గా ప్రేక్షకులు చూస్తారా అనేది కొంత అనుమానంగానే ఉంది. 

అందుకే పోస్టర్స్ లో ఎక్కువగా తమన్నా ఉండేలా చూసుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ మొహంలో రఫ్ నెస్ లుక్ కనిపిస్తుంది అది పోగొట్టాలనే మిల్కీ బ్యూటీ తమన్నా ను పోస్టర్స్ లో ఉండేటట్టు చూస్తున్నారు. 'ఎమ్మెల్యే' ప్లాప్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' మీద గట్టి ఆశలే పెట్టుకున్నాడు. 

ఇకపోతే సుధీర్ బాబుకి 'సమ్మోహనం' హిట్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే సుధీర్ బాబు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్స్ ఏమి లేవు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇందులో సుధీర్ నటనకు హోప్ ఉండే అవకాశముంది. ఇక డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తన మ్యాజికల్ స్క్రీన్ ప్లే తో సినిమా బాగానే తీశాడని ఆశిస్తున్నారు. ఈ సినిమాతో అదితి రావు తెలుగు తెరకు పరిచయం అవుతుంది. సో దాంతో ఈ వారం రిలీజ్ అయ్యే రెండు సినిమాలు ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి.

Sponsored links

Naa Nuvve and Sammohanam Ready to Release:

Naa Nuvve VS Sammohanam

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019