Advertisementt

నాని బిగ్‌బాస్ హంగామా సంగతేంటి?

Tue 12th Jun 2018 02:06 PM
hero nani,bigg boss 2,jr ntr,host  నాని బిగ్‌బాస్ హంగామా సంగతేంటి?
Bigg Boss 2: Nani Fails To Impress Like NTR నాని బిగ్‌బాస్ హంగామా సంగతేంటి?
Advertisement

నిన్న బిగ్ బాస్ సీజన్ 2  స్టార్ట్ అయింది. హోస్ట్ గా నాని పర్లేదు అనిపించుకున్నాడు. కాకపోతే ఎన్టీఆర్ అంత స్పాంటేనియస్ గా నాని ఫాస్ట్ రియాక్షన్స్ ఇవ్వలేకపోతున్నాడు. కానీ కొత్త పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నాడు నాని. షో స్టార్టింగ్ లోనే ఎన్టీఆర్ కు థ్యాంక్స్ చెప్పాడు. నేను ఏ ముహూర్తాన బిగ్ బాస్ చూడలేదు అని చెప్పానో మొన్న రెండు రోజులు వరసబెట్టి సీజన్ మొత్తం చూపించేశారు అని చమత్కారంగా చెప్పాడు.

బిగ్ బాస్ ప్రోమోస్ లో ఏదైనా జరగొచ్చు అని అనడం.. ఈసారి ఇంకొంచం మసాలా అని చెప్పడం చూస్తే ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ పోయినసారిలాగా ఈసారి చెప్పుకోదగ్గ సెలెబ్రెటీస్ లేరు. ఒక్కొక్క పార్టిసిపెంట్ ని పంపడం అంతా ఒక ఫార్ములా వ్యవహారంలా సాగిందే తప్ప ఇంకా స్పైసీగా ఉండాల్సిన అవసరం ఉంది. మొదటి సీజన్ లో లోపాలు ఉన్న ఎన్టీఆర్ తన ప్రెజెన్స్ తో దాదాపుగా కవర్ చేసేశాడు.

తన సహజమైన నటనతో టీఆర్పీ రేటింగ్స్ ని పెంచేశాడు జూనియర్. మరి ఈసారి నానిపై కొండంత బాధ్యత పడింది. మొదటగా ఎన్టీఆర్ కన్నా ఇంకా బాగా హోస్ట్ చేసి ఎన్టీఆర్ గుర్తుకు రాకుండా చేయాలి. ప్రోమోస్ లో చూపించినట్లు ఆ మసాలా ఏదో బిగ్ బాస్ కి జోడించాలి. ఎన్టీఆర్ లాగా స్పాంటేనియస్ గా ఉండాలి. ఇలా చాలా చేయాలి. లేకపోతే జనాలు బిగ్ బాస్ ని పట్టించుకునే అవకాశాలు లేవు. మొదటి రోజు అయితే పాస్ అయ్యాడు కానీ నాని అసలు ఛాలెంజ్ ని వచ్చే వారం ఫేస్ చేయబోతున్నాడు. సో లెట్ వెయిట్ అండ్ సీ.

Bigg Boss 2: Nani Fails To Impress Like NTR:

Bigg Boss 2: Nani No Match To NTR  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement