Advertisement

‘కాలా’ సెంచరీ కొట్టేశాడండోయ్..!

Mon 11th Jun 2018 07:35 PM
rajinikanth,kaala movie,box office,100 crores  ‘కాలా’ సెంచరీ కొట్టేశాడండోయ్..!
Kaala 3 Days Collections : Rajinikanth film crosses Rs 100 Cr ‘కాలా’ సెంచరీ కొట్టేశాడండోయ్..!
Advertisement

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలంటే ఫ్యాన్స్ లో పిచ్చ క్రేజ్ కానీ.. ప్రస్తుతం రజినీకాంత్ స్టామినా బాక్సాఫీసుని షేక్ చెయ్యలేకపోయింది. రజినీకాంత్ 'కాలా' చిత్రం గత గురువారమే విడుదలై బాక్సాఫీసు వద్ద పెద్ద మ్యాజిక్ చెయ్యలేక తెగ ఇబ్బంది పడుతుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మాత్రమే 'కాలా' కి కష్టాలు వచ్చిపడ్డాయి. యావరేజ్ టాక్ తో 'కాలా' కలెక్షన్స్ ఢీలా పడిపోయాయి. కానీ తమిళనాట మాత్రం 'కాలా' కొచ్చిన యావరేజ్ టాక్ తోనే రజినీకాంత్ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో చెన్నై లో అన్ని రికార్డులను తిరగేసిన 'కాలా'.. తమిళనాట సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుందట.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతంతమాత్రంగా వున్న 'కాలా' కలెక్షన్స్ తమిళనాట మాత్రం అదరగొడుతున్నాయంటున్నారు. తమిళనాట 'కాలా' సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ తెచ్చుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు కూడా. ధనుష్ నిర్మాతగా రంజిత్ పా డైరెక్షన్ లో తెరకెక్కిన 'కాలా' సినిమాని తమిళ ప్రజలు ఆదరించారు. అందుకే అక్కడ హిట్ అయ్యింది. అయితే 'కాలా' సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ తెచ్చినట్లుగా ప్రముఖ మూవీ అనలిస్ట్ రమేష్ బాలా ట్విట్టర్ వేదికగా అధికారికముగా ప్రకటించాడు. ఆయన తన ట్విట్టర్ లో...  బ్రేకింగ్: 'కాలా' ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ తెచ్చినట్లుగా ట్వీట్ చేశాడు.

మరి తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ కి 'కబాలి' తో క్రేజ్ తగ్గిపోయిందని... 'కాలా' కలెక్షన్స్ చెబుతుంటే... తమిళనాట మాత్రం ఎన్ని చిత్రాలు ప్లాప్ అయ్యింది కాదన్నయ్యా.. ఇక్కడి విషయం.... ఆయన కొత్త చిత్రానికి ఎంత బజ్ ఉంది... అలాగే ఎంత క్రేజ్ వచ్చిందనేది ఇక్కడి లెక్క అన్నట్టుగా కలెక్షన్స్ ఉన్నాయి.  మరి రజినీకాంత్ కి 'కబాలి' ప్లాప్ వదిలిపోయి తమిళంలో 'కాలా' విజయదుందుభి మోగించినదన్నమాట. కాకపోతే కొందరు మాత్రం నిజంగానే 'కాలా' 100 కోట్లు తెచ్చిందా అనే ఆశ్చర్యంలో ఉన్నారు... అది వేరే విషయం.

Kaala 3 Days Collections : Rajinikanth film crosses Rs 100 Cr:

Kaala box office: Rajinikanth film crosses Rs 100 crore mark worldwide in just 3 days

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement