ఈసారి కలిసినప్పుడు తారక్ తో: పూజా హెగ్డే!

Sat 09th Jun 2018 11:24 AM
aravinda sametha,pooja hegde,jr ntr,selfie,trivikram srinivas  ఈసారి కలిసినప్పుడు తారక్ తో: పూజా హెగ్డే!
Pooja Hegde says, Jr NTR was Missed in this One ఈసారి కలిసినప్పుడు తారక్ తో: పూజా హెగ్డే!
Sponsored links

ఎన్టీఆర్ - పూజాహెగ్డే కాంబినేషన్ లో మాటల మాంత్రికుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమా ప్రస్తుతం మూడవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా తనకు సంబంధించి ఈ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిందని.. త్రివిక్రమ్ తో ఒక సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో పోస్ట్ తన అభిమానులతో ఆనందాన్ని షేర్ చేసుకుంది. డైలీ సెట్‌కి రావడం చాలా ఉత్సాహంగా అనిపించేదని, తారక్‌.. నువ్వు మిస్సయ్యావ్‌. ఈసారి కలిసినప్పుడు మనం ఫోటో దిగుదాం అని తన ట్విట్టర్ పోస్ట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ కి జోడిగా పూజా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ రాఘవ పాత్రలో, పూజా అరవింద పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల అవ్వడంతో ఈ సినిమా అంచనాలు పెరిగాయి. ఇక కాజల్ ఐటెం సాంగ్ లో నటించనుంది. నాగబాబు, జగపతి బాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ దసరాకు సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Sponsored links

Pooja Hegde says, Jr NTR was Missed in this One:

Pooja Hegde Shares Selfie with Trivikam at Aravinda Sametha Sets

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019