పవన్‌కళ్యాణ్ యాత్ర ప్రారంభించి, రెండు జిల్లాలు దాటుకుని మూడో జిల్లాలోకి ప్రవేశించింది. పవన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని, జనసేన గెలవడం ఖాయమని, తాను ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నాడు. ఇక ఈ యాత్ర అసలు లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. సినీ అభిమానులు, సినిమా వారిని చూడాలని భావించే వారు తప్ప ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్న వారు.. మేధావి వర్గం మాత్రం పవన్ మాటలను, యాత్రలను పట్టించుకోవడం లేదు. పార్టీలో చేరికలనేవి లేవు. నిజానికి జనాలను ఆకర్షించడం, ఇతర పార్టీలలోని నాయకులను, రాజకీయాలలోకి రావాలనుకుంటున్న ఔత్సాహికులను ప్రముఖులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ యాత్రను ప్రారంభించినప్పటికీ ఆ లక్ష్యం నెరవేరడం లేదు.
దీంతో అన్ని ప్రాంతాలలో పవన్‌కి అభ్యర్ధులు దొరకడం కూడా అనుమానమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల టిక్కెట్లలో వెనుకబడిన వారు, అసంతృప్తులు, సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఎవరు పార్టీలో చేరడం కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి టిడిపి, వైసీపీలలోకి వెళ్లలేని వారు కూడా పవన్‌కి ఆకర్షితులు కావడం లేదు. నాడు చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో కనీసం ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నుంచి తమ్ముడికి అభ్యర్దులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడనుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇక తాజాగా పవన్ అరకు ఏజెన్సీని పర్యటించిన తర్వాత ఆయనకు స్థానికుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఇంత వరకు ఎవ్వరూ వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్నే స్వయంగా సమస్యలను అడిగినవారు ఎవ్వరూ లేరు.
కానీ పవన్ బాబు వచ్చి మా కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అతడు మాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు.ఈయన మహిళలు, గర్భిణులు పడుతున్న కష్టం చూసి ఎంతో బాధపడి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ తమ వద్దకు రావడం, తమ అవస్థలు, కష్టాల గురించి తెలుసుకోవడం పట్ల అరకు ఏజెన్సీలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామానికి ఎవరు రాలేదు. ఈ మహానుభావుడు వచ్చాడు. ఆయనకు దండం పెడుతున్నాను. ఆయన ముఖ్యమంత్రి అవుతాడనే నమ్మకం తనకి ఉందని ఓ వృద్దురాలు మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది...!




స్నేహం కోసం ఓ గేమ్ షో..! 
Loading..