Advertisementt

'అభిమన్యుడు' కుమ్మేస్తున్నాడుగా..!

Wed 06th Jun 2018 12:24 PM
abhimanyudu,vishal,mithran,samantha,collections  'అభిమన్యుడు' కుమ్మేస్తున్నాడుగా..!
Vishal Abhimanyudu Weekend Record Collections In Tollywood 'అభిమన్యుడు' కుమ్మేస్తున్నాడుగా..!
Advertisement
Ads by CJ

విశాల్ ముఖ్య పాత్రలో సమంత హీరోయిన్ గా రూపొందిన చిత్రం 'అభిమన్యుడు'. తమిళలో 'ఇరుంబు తిరై' పేరుతో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది. తెలుగులో కూడా గత శుక్రవారం విడుదలైన 'అభిమన్యుడు' మంచి టాక్ తో దూసుకుపోతుంది. డిజిటల్ ఇండియా నేపథ్యంలో ఒక సామాన్యుడు ఎదుర్కునే ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది.

కొత్త దర్శకుడు మిత్రన్ దర్శకత్వం చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా  600 థియేటర్స్ లో విడుదల అయింది. విడుదల అయిన ప్రతి చోట మంచి రెస్పాన్స్ రావడంతో అదనంగా 60 థియేటర్స్ పెంచుతున్నారు. తెలుగు స్టేట్స్ లో మూడు రోజులు ముగిసేసరికి 7.10 కోట్లను వసూలు చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయమని అంటున్నారు.

విశాల్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో అటు తమిళ... ఇటు తెలుగులో హిట్ అయిన సినిమా ఇది ఒక్కటే. మొత్తానికి హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బాగా సక్సెస్ అయ్యాడు విశాల్. మరి ఈ సినిమా విశాల్ కు ఎన్ని లాభాలు తెచ్చిపెడుతుందో చూద్దాం.

Vishal Abhimanyudu Weekend Record Collections In Tollywood:

Abhimanyudu Three Days Collection Report

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ